Watch Video: 24 ఏళ్ల కెరీర్‌ను భావోద్వేగంతో ముగించిన లిటిల్ మాస్టర్.. వైరలవుతోన్న వీడియో..!

Sachin Tendulkar Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు చెప్పి 8ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా బీసీసీఐ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. లిటిల్ మాస్టర్ మాట్లాడిన ఓ వీడియో కూడా నెట్టింట్లో సందడి చేస్తోంది.

Watch Video: 24 ఏళ్ల కెరీర్‌ను భావోద్వేగంతో ముగించిన లిటిల్ మాస్టర్..  వైరలవుతోన్న వీడియో..!
Sachin Tendulkar India Celebrates 8 Years Of Tendulkar's Retirement
Follow us
Venkata Chari

|

Updated on: Nov 16, 2021 | 3:38 PM

Sachin Tendulkar Retirement: భారత క్రికెట్ జట్టులో గొప్ప ఆటగాడు సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల కెరీర్‌ను 2013లో ఈ రోజుతో ముగించాడు. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సచిన్.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్ వెస్టిండీస్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో సచిన్ 74 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

సచిన్ ఎమోషనల్.. మ్యాచ్ తర్వాత సచిన్ చాలా ఎమోషనల్ అయ్యాడు . ప్రసంగిస్తున్నప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. 22 గజాలలో నా 24 ఏళ్ల నా జీవితం, ఇంత అద్భుతమైన ప్రయాణం ఇప్పుడు ముగిసిందంటే నమ్మడం కష్టమని ఆయన అన్నారు.

‘నా చివరి మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాలం చాలా త్వరగా మారుతుందని తెలుసు. కానీ, మీరు మిగిల్చిన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి’ అని పేర్కొన్నాడు.

టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు.. సచిన్ 200 టెస్టుల్లో 15921 పరుగులు, 463 వన్డేల్లో 18426 పరుగులు సాధించాడు. సచిన్‌కు టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు ఉన్నాయి. కేవలం ఒకే ఒక టీ20 ఆడాడు. అందులో 10 పరుగులు మాత్రమే చేశాడు.

1990లో తొలి టెస్టు సెంచరీ.. సచిన్ 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై తొలి మ్యాచ్ ఆడాడు. ఆగస్టు 1990లో ఇంగ్లండ్ పర్యటనలో సిరీస్‌లో రెండో టెస్టులో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 432 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 408 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 320 పరుగులకే ఆలౌటైంది.

అయితే భారత్ 183 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. అటువంటి పరిస్థితిలో, ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన సచిన్ అజేయంగా 119 పరుగులు చేశాడు. దీంతో చివరి రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 343 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. మనోజ్ ప్రభాకర్ కూడా సచిన్‌తో కలిసి అజేయంగా 67 పరుగులు చేశాడు. టెండూల్కర్ తన రిటైర్మెంట్ టెస్టులో సెంచరీని సాధించలేకపోయాడు. డారెన్ సామీ ఓ అద్భుతమైన క్యాచ్‌తో 118 బంతుల్లో 74 పరుగులు చేసి తన చివరి మ్యాచులో పెవిలియన్ చేరాడు.

టెండూల్కర్ తన పదవీ విరమణ తర్వాత ఆటకు దూరంగా ఎక్కువ సమయం గడపలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ (MI)లో IPL 2014లో చేరాడు. అప్పటి నుంచి ముంబై 4 IPL టైటిళ్లను గెలుచుకుంది. టెండూల్కర్ ఇప్పుడు పార్ట్ టైమ్ కోచ్, క్రికెట్ విశ్లేషకుడిగా రాణిస్తున్నారు. అలాగే ముంబై ఇండియన్స్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు.

Also Read: IND vs NZ Schedule: రేపటి నుంచే భారత్ వర్సెస్ కివీస్ టీ20 పోరు.. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్‌లకు కీలకం కానున్న తొలి సిరీస్

IND vs NZ: ద్రవిడ్ బౌలింగ్.. రోహిత్ బ్యాటింగ్.. నెట్టింట్లో వైరలవుతోన్న టీమిండియా ప్రాక్టీస్ వీడియో

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో