Viral Video: అమ్మబాబోయ్.! భయంకర సాలీడుగా మారిన శునకం.. కుక్కను చూసి బెదిరిపోతున్న జనం.. వైరల్ వీడియో!

సోషల్ మీడియా అనేది ట్రెండింగ్ నుండి వింత విషయాల వరకు కనిపించే వేదిక. వాటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవాల్సిందే...

Viral Video: అమ్మబాబోయ్.! భయంకర సాలీడుగా మారిన శునకం.. కుక్కను చూసి బెదిరిపోతున్న జనం.. వైరల్ వీడియో!
Dog And Spider
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2021 | 4:58 PM

సోషల్ మీడియా అనేది ట్రెండింగ్ నుండి వింత విషయాల వరకు కనిపించే వేదిక. వాటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా జంతువులకు సంబంధించిన అందమైన వీడియోలను చూడటం అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ, ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో మాత్రం నెటిజన్లను ఓ రకంగా భయపెడుతోందని చెప్పాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వీడియోలో ఒక జంతువు సాలీడులా కనిపిస్తోంది. కాబట్టి అది నిజంగానే భారీ సైజున్న సాలీడు కావొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది సాలీడు కాదు కుక్క. అవునే ఖచ్చితంగా ఇది శునకమే. స్పైడర్‌గా మారిన ఈ డాగ్ ప్రస్తుతం నెట్టింట్ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.!

ఇలా స్పైడర్‌గా మారిన ఈ కుక్క వీడియోను ‘హిలేరియస్ టెడ్’ అనే ఫేస్‌బుక్‌ ఖాతా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ”వింత జంతువు ఏమోనంటూ” ఒకరు కామెంట్ చేయగా.. ”భారీ సాలీడు అనుకుని ఎవరైనా దాడిచేస్తే.. కుక్క ప్రాణాలకే ప్రమాదం” అని మరొకరు.. ”బాబోయ్‌ కుక్కను ఇలా ఎందుకు మార్చేశారు గురూ” వేరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

  1. Viral Video: పాముకు ఎలుక చిక్కితే ఎట్టుంటుందో తెలుసా.? ఫైట్ మాములుగా లేదు.. షాకింగ్ వీడియో.!
  2. 21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!
  3. Viral News: గోడ నుంచి వింత శబ్దాలు.. బద్దలు కొట్టి చూడగా రెస్క్యూ సిబ్బంది ఫ్యూజులు ఔట్.!
  4. Viral Photo: ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టండి చూద్దాం.. పజిల్ అంత ఈజీ కాదండోయ్.!
  5. Viral Video: ఇదేం ‘మాస్’ క్రియేటివిటీ మావా.! ఈ వ్యక్తి చేసిన పనికి ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడతారు..