Viral Photo: ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టండి చూద్దాం.. పజిల్ అంత ఈజీ కాదండోయ్.!
సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి వినోదానికి కొదవ లేకుండాపోయింది. ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తరచూ నెట్టింట...
సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి వినోదానికి కొదవ లేకుండాపోయింది. ఎన్నో రకాల వైరల్ వీడియోలు, ఫోటోలు తరచూ నెట్టింట తెగ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఇక కంటెంట్ క్రియేటర్లు కూడా తమ పంధాను మార్చుకుని నెటిజన్లు అలరిస్తున్నారు. ఈ కోవలోనే ఫోటో పజిల్స్ ప్రాచుర్యాన్ని పొందాయి.
‘ఇందులో సింహం ఎక్కడుందో కనిపెట్టండి’.. ‘మొసలిని గుర్తిస్తే మీరు గ్రేటే’ అంటూ పలకరించే పలు రకాల ఫోటోలు మన మెదడుకు పదును పెడుతుంటాయి. వాటిని తీక్షణంగా చూస్తే తప్ప.. మనం అందులో ఏముందో కనిపెట్టలేం. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో.. పాత ఫోటో పజిల్స్ కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
Find The Tiger In This Viral Photo..@TheViralFever @the_viralvideos @WhatsTrending @TrendingWeibo pic.twitter.com/S7VKzLylWS
— telugufunworld (@telugufunworld) November 16, 2021
పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత దాగుంది. అదెక్కడుందో కనిపెట్టగలరా.? మీరు ఫోటోను మొదటిసారి చూస్తే చెప్పలేరు. తీక్షణంగా చూస్తే ఈజీగా పజిల్‌ను సాల్వ్ చేసేయొచ్చు. చుట్టూ మంచుతో నిండిన పర్వతాలు.. వాటి రంగుతో చిరుత చర్మం రంగు కూడా కలిసిపోవడంతో అదెక్కడ ఉందో గుర్తించలేం. చాలామంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి.! సమాధానం తెలియకపోతే క్రింద ట్వీట్‌ను చూడండి..
Here is the answer… pic.twitter.com/INNnzNfdv8
— telugufunworld (@telugufunworld) November 16, 2021
ఇదిలా ఉంటే.. మంచు చిరుతలు అరుదైన జాతికి చెందిన జంతువులు. ఇవి ఎక్కువగా కొండలు, పర్వతాలపై తమ జీవనాన్ని సాగిస్తుంటాయి. వాటికీ నీలం రంగు గొర్రెలు ఇష్టమైన ఆహారం అని చెప్పొచ్చు. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలోనే చురుగ్గా ఉంటాయి.
Also Read: