Viral Video: ఇదేం ‘మాస్’ క్రియేటివిటీ మావా.! ఈ వ్యక్తి చేసిన పనికి ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడతారు..

'నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్'.. ఈ ప్రపంచంలో తెలివికి కొదవలేదు. చదువుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రియేటివ్‌గా ఆలోచిస్తుంటారు..

Viral Video: ఇదేం 'మాస్' క్రియేటివిటీ మావా.! ఈ వ్యక్తి చేసిన పనికి ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడతారు..
Bike To Cycle
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 16, 2021 | 1:20 PM

‘నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’.. ఈ ప్రపంచంలో తెలివికి కొదవలేదు. చదువుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ క్రియేటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఏదొక సమయంలో తమలోని ప్రతిభను వెలికి తీస్తుంటారు. మరీ ముఖ్యంగా కొంతమంది అక్కర్లేని వస్తువులతో చేసే ఇన్వెన్షన్స్ క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి బుల్లెట్‌ను సైకిల్‌గా మార్చాడు. మీరు కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోతారు.

ఈ రోజుల్లో పెట్రోల్ ధర రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనితో చాలామంది ఎలక్ట్రిక్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ వ్యక్తి తనలోని క్రియేటివిటీని వెలికితీసి ‘బుల్లెట్ ఎక్స్‌ప్రెస్’ అనే సైకిల్‌ను తయారు చేశాడు. ఇప్పుడిది ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి సైకిల్‌కు బుల్లెట్ లుక్ ఇచ్చినట్లు మీరు చూడవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ సీటు కవర్, వెనుక భాగాన్ని ఆ వ్యక్తి తన సైకిల్‌కు అమర్చాడు.

అంతేకాకుండా వెనుక తన భార్యను కూర్చోబెట్టుకుని రైడ్‌కు వెళ్తున్నాడు. అలాగే ఆ సైకిల్‌కు హ్యాండిల్‌ బదులుగా స్టీరింగ్‌ను పెట్టాడు. ఇంచక్కా దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాడు. అతడు నడుపుతున్న తీరును చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. ఇక రోడ్డుపై వెళ్తున్న కొంతమంది దీనిని వీడియోగా తీయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram

A post shared by kunal Diwakar (@upcopmanish)

కాగా, ఈ వీడియోను ‘upcopmanish’ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు.. ఆ వ్యక్తి చేసిన పనికి ఫిదా అయిపోయారు. వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘ఈ ఇన్వెన్షన్ చూసి ఐన్‌స్టీన్, న్యూటన్.. ఒక్కసారి ఆశ్చర్యానికి గురవుతారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘నిజంగా ఈ క్రియేటివిటీ వేరే లెవెల్’ అంటూ వేరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Also Read:

  1. Viral Video: పాముకు ఎలుక చిక్కితే ఎట్టుంటుందో తెలుసా.? ఫైట్ మాములుగా లేదు.. షాకింగ్ వీడియో.!
  2. 21 సిక్సర్లు, 16 ఫోర్లు.. సూపర్ ఫాస్ట్ డబుల్ సెంచరీతో బౌలర్లపై వీరవిహారం.. ఆ ఆటగాడు ఎవరంటే.!
  3. Viral News: గోడ నుంచి వింత శబ్దాలు.. బద్దలు కొట్టి చూడగా రెస్క్యూ సిబ్బంది ఫ్యూజులు ఔట్.!
  4. Viral Photo: ఈ ఫోటోలో మంచు చిరుతను కనిపెట్టండి చూద్దాం.. పజిల్ అంత ఈజీ కాదండోయ్.!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..