AP Cinema Ticket Rate: ఏపీలో థియేటర్లపై పోలీసులు తనిఖీ.. టికెట్ల ధరలపై..
AP Cinema Ticket Rate: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గిస్తూ జీవో నంబర్ 35ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే...
AP Cinema Ticket Rate: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గిస్తూ జీవో నంబర్ 35ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీన్ని సవాల్ చేస్తూ కొంత మంది థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తూ జారీ చేసిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. జీవో నెం.35 రద్దు రాష్ట్రంలోని అన్ని థియేటర్‌లకు వర్తిస్తుందని ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే జీవో నెం.35 రద్దు అయినా, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం పొందాలంటే థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ల అనుమతి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే ఏయే థియేటర్లలో ధరలు పెంచారో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఇందులో భాగంగానే తాజాగా విజయవాడలో ఉన్న అన్ని థియేటర్లలో పోలీసులు తనిఖీ చేప్టటారు. టికెట్ల ధరలపై థియేటర్ల వద్ద వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఏయో థియేటర్లు ఎక్కువ ధరలకు టికెట్లు వసూళ్లు చేస్తున్నాయన్న కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దాదాపు అన్ని థియేటర్లలో పోలీసులు తనిఖీలు పూర్తయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీలో సినిమా టికెట్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే టికెట్ల విక్రాయల బాధ్యతను APFCకి అప్పగించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Also Read: TRAI Recruitment: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
CM Jagan Birthday Celebrations: అధిపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. లైవ్ వీడియో