Andhra Pradesh: ఇంటర్ బోర్డు నిర్వాకం.. ఇంటర్ ఫిలితాల్లో ఫిజిక్స్‌లో ఫెయిల్‌.. రీవెరిపికేషన్‌లో 60కి 59 మార్కులతో పాస్‌!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు మే 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి భౌతికశాస్త్రం-2 మూల్యాంకనంలో జరిగిన పొరపాటు వల్ల..

Andhra Pradesh: ఇంటర్ బోర్డు నిర్వాకం.. ఇంటర్ ఫిలితాల్లో ఫిజిక్స్‌లో ఫెయిల్‌.. రీవెరిపికేషన్‌లో 60కి 59 మార్కులతో పాస్‌!
AP Inter Revaluation Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: May 18, 2023 | 8:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షల రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు మే 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి భౌతికశాస్త్రం-2 మూల్యాంకనంలో జరిగిన పొరపాటు వల్ల ఈ సబ్జెక్టులో ఫెయిల్‌ అయ్యింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన అమ్మాయి రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసింది.

రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్‌ బోర్డు మే 16న‌ విడుదల చేయడంతో అసలు విషయం బయటపడింది. రీవెరిఫికేషన్‌లో 60 మార్కులకు గానూ 59 వచ్చాయి. బోర్డు అధికారుల తప్పిదంతో ఈ విద్యార్ధిని తీవ్ర మానసిక వ్యథకు గురైంది. కాగా ఏప్రిల్ 26న ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో గౌతమి పరీక్షలు బాగా రాసినప్పటికీ ఫిజిక్స్‌లో ఫెయిల్‌ అయినట్లు ఫలితాలు వచ్చాయి. దీంతో మానసిక వేధనలక గురైన విద్యార్ధిని రీకౌంటిక్‌కు దరఖాస్తు చేసుకుంది. ఫలితాల్లో ఏకంగా 59 మార్కులతో పాస్ అయినట్లు తెలిసింది. దీంతో ఇంటర్‌ బోర్డు అధికారుల తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఇమైనా ఇబ్బందులు ఎదురైతే టోల్‌ఫ్రీ నంబరు 18004257635కి సంప్రదించాలని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.