AP Tenth Exams 2023: ‘పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగితే అధికారులదే బాధ్యత’.. డైరెక్టర్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఏడాది టెన్త్‌ పరీక్ష కేంద్రాల్లో ఏవైనా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటే చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారి, సీ-సెంటర్‌ కస్టోడియన్‌ బాధ్యత వహించాలని..

AP Tenth Exams 2023: 'పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగితే అధికారులదే బాధ్యత'.. డైరెక్టర్‌
AP Tenth Exams 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 05, 2023 | 1:18 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐతే ఈ ఏడాది టెన్త్‌ పరీక్ష కేంద్రాల్లో ఏవైనా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటే చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ అధికారి, సీ-సెంటర్‌ కస్టోడియన్‌ బాధ్యత వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఆదేశించారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్‌ జోన్లుగా ప్రకటించామని, పరీక్ష విధుల్లో పాల్గొనేవారంతా తమ సెల్‌ఫోన్‌ ఇంటిలోనే ఉంచి రావాలని ఆయన సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఒకసారి ప్రవేశించిన సిబ్బంది పరీక్ష పూర్తయ్యే వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వెళ్లకూడదన్నారు. పరీక్షల విధులు లేని ఉపాధ్యాయులు పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల పరిసరాల్లో ఉండకూడదని హెచ్చరించారు.

అలాగే పరీక్ష కేంద్రంలోగాని, దాని పరిసర ప్రాంతాల్లోగానీ ప్రైవేటు వ్యక్తులు ఉండకూడదని తెలిపారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల ప్రశ్నపత్రాలను ఉదయం 10 గంటలోపు సీల్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు అన్ని పరీక్ష కేంద్రాలకు డైరెక్టర్‌ దేవానందరెడ్డి సూచనలు జారీ చేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకుల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో కూడా ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పరీక్షలను అప్రమత్తంగా నిర్వహించేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.