Andhra Pradesh: అప్పటివరకు ఆగాల్సిందే.. ఇంటర్ అడ్మిషన్లపై జగన్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్మిషన్లు ఇవ్వొద్దంటూ అన్ని కళాశాలలకు సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ సర్కార్ ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్మిషన్లు ఇవ్వొద్దంటూ అన్ని కళాశాలలకు సూచించింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. మరికొన్ని కొన్ని రోజుల్లో కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ కాలేజీలకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరీక్షలు ముగియడంతో ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1న తిరిగి కళాశాలలు ప్రారంభం కానున్నాయి.
ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి కొన్ని కళాశాలలు ఆడ్మిషన్స్ ప్రారంభిస్తున్న విషయం విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఇంటర్ ఆడ్మిషన్లపై విద్యాశాఖ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విద్యాశాఖ.. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా అడ్మిషన్లు ప్రారంభించాలని సూచించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..



