AP Corona Cases: ఏపీలో మళ్లీ వెయ్యి దాటిన కరోనా కేసులు.. టెన్షన్ పుట్టిస్తోన్న విష జ్వరాలు..
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు..
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20.23,242 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 14,452 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1266 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 19,94,855కి చేరింది. అలాగే తాజాగా వైరస్ కారణంగా 10 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 13,935కి చేరింది.
మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 17, చిత్తూరు 204, తూర్పుగోదావరి 72, గుంటూరు 135, కడప 15, కృష్ణ 151, కర్నూలు 34, నెల్లూరు 177, ప్రకాశం 118, శ్రీకాకుళం 48, విశాఖపట్నం 74, విజయనగరం 9, పశ్చిమ గోదావరి 124 కేసులు నమోదయ్యాయి.
కాగా, అటు ఏపీని మళ్లీ మరో కొత్త భయం వెంటాడుతోంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డెంగీ జ్వరాలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా డెంగీతో పాటూ మలేరియా, విష జ్వరాల టెన్షన్ పెరిగిపోతోంది..ఒక్కసారిగా కేసులు పెరగడంతో ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
రాష్ట్రంలో డెంగీ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో విశాఖ జిల్లాలో కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. గత వారం రోజుల్లో నమోదైన కేసుల్లో దాదాపుగా 39 శాతం ఇక్కడే నమోదయ్యాయి. అయితే, వారం రోజుల సమయంలో 225 కేసులు నమోదైనట్లు ప్రభత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో..అప్రమత్తమైన ఆరోగ్య శాఖ మరో 30 ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ పరీక్షలకు అనుమతి ఇచ్చింది.
#COVIDUpdates: 07/09/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,20,347 పాజిటివ్ కేసు లకు గాను *19,91,960 మంది డిశ్చార్జ్ కాగా *13,935 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,452#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/nWoska4Coo
— ArogyaAndhra (@ArogyaAndhra) September 7, 2021
Also Read:
తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపట్నుంచి తిరుమలలో ఉచిత దర్శనాలు..
పొదల్లో దాగున్న పులి.. కనిపెట్టండి చూద్దాం మరీ.. పజిల్ మాత్రం చాలా కష్టం గురూ!
ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!
కొండచిలువతో క్రేజీ ఆటలు.. కోపంతో విషసర్పం దాడి.. గగుర్పొడిచే వీడియో!
3 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీలు.. 4 టెస్టులతో కెరీర్ క్లోజ్.. ఈ టీమిండియా ప్లేయర్ ఎవరంటే.?