Court Contempt Petition: పోలీసులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు.. రూ.10 లక్షల నష్ట పరిహరం చెల్లించాలని డిమాండ్..!
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులపై హైకోర్టు దిక్కారణ పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ అక్రమ అరెస్ట్ చేశారంటూ పిటిషన్ దాఖలు.
High Court Contempt Petition: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులపై హైకోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలైంది. కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ అక్రమ అరెస్ట్ చేశారంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు స్టే ఉన్న రామకృష్ణను పిడుగురాళ్ల పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, పిడుగురాళ్ల టౌన్ సిఐ ప్రభాకర్ , ఎస్ఐ లు సమీర్ బాషా, ఎం పవన్ కుమార్, చరణ్, ఏఎస్ఐ గౌరి, కానిస్టేబుల్స్ వెంకటరెడ్డి, రామకృష్ణ లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ.10 లక్షల నష్ట పరిహరం చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మఫ్టీలో వచ్చిన పోలీసులు.. యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణను తీసుకెళ్లారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు కిడ్నాప్ చేయడంపై పోలీసులపై ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఏపీలో పోలీసులకు న్యాయస్దానం అంటే లెక్కలేకుండా పోయిందన్న పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు నివేదించారు.
ఇదిలావుంటే, ఓ కేసులో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వ్యక్తిని బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకొని తరువాత గుట్టుచప్పుడు కాకుండా వదిలేశారు. తెలుగుయువత నాయకుడు దియ్యా రామకృష్ణప్రసాద్‌ను పిడుగురాళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. ఏ ఆరోపణలపై అయితే రామకృష్ణప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదయ్యిందో ఆ కేసులో హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయం పోలీసులకు తెలిసికూడా రామకృష్ణప్రసాద్‌ను ఆదివారం ఉదయం గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. ఒకరోజంతా పోలీసులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ శ్రేణులు నిరసనకు సిద్ధపడటంతో పోలీసులు హడావిడి చర్యలు ప్రారంభించారు. సోమవారం ఉదయం రామకృష్ణప్రసాద్‌ను మెజిసే్ట్రట్ ఎదుట హాజరుపరిచేందుకు గురజాల తీసుకెళ్లారు. అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండానే రోడ్డుపై అతన్ని వదిలి వెళ్లిపోయారు.
Read Also… AP Corona Cases: ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి.. కొత్తగా పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
Malla Vijay Prasad: వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్‌ను అరెస్ట్ చేసిన ఒడిశా పోలీసులు.. కారణం అదేనా..?