Andhra Pradesh: పారిశ్రామికాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్దికి పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకొని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి...
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్దికి పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకొని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాగ్రానికి దిశా నిర్దేశం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు – మౌలిక వసతులపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ విషయాలను తెలిపారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. ఇంటర్నెట్, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక కారిడార్లపై దిశా నిర్దేశం చేశారు.
పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి కోసం అవసరమైతే ముగ్గురు ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీని నియమించాలని సీఎం సూచించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పరిశ్రమలకు అన్ని అనుమతులు త్వరగా మంజూరయ్యేలా సీఎస్, సీఎంవో అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు చేయూత అందించి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు అందించాలని జగన్ ఆదేశించారు. వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభించి నిరుద్యోగం తగ్గుతుందని, అందుకే ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఇక వచ్చే డిసెంబర్ నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లను ఫైబర్‌తో అనుసంధానించి ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 5జీ సేవలను గ్రామాలకు చేరవేసే విధంగా టెలికాం కంపెనీలతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ పని చేయాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయన్న సీఎం.. వైఎస్సార్ జిల్లా వేల్పులలో నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడ నుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇలాంటి లైబ్రరీలు వస్తే సొంతూరి నుంచే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుందన్న సీఎం… అందుకే డిజిటల్ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..