Ramakrishna Reddy: రాజకీయాల్లో ఆస్తులు.. ప్రాణాలు కోల్పోయాం.. రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి సంచలన వ్యాఖ్యలు..
వైఎస్ఆర్ పై అభిమానంతో తమ తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చాడని.. పాలిటిక్స్‌లో ఆస్తులు.. ప్రాణాలు పోగొట్టుకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్తులు పోయినా అవినీతికి పాల్పడలేదన్నారు..
వైసీపీ లీడర్ రామకృష్ణారెడ్డి మర్డర్ హీట్ పుట్టిస్తోంది. అనంతపురం రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. హత్య వెనుక ఎమ్మెల్సీ హస్తముందని ఆరోపిస్తోంది రామకృష్ణారెడ్డి కుటుంబం. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతోంది. వైసీపీ నేత రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి సంచలన కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ పై అభిమానంతో తమ తమ్ముడు రాజకీయాల్లోకి వచ్చాడని.. పాలిటిక్స్‌లో ఆస్తులు.. ప్రాణాలు పోగొట్టుకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్తులు పోయినా అవినీతికి పాల్పడలేదన్నారు మధుమతి. గుర్తింపు రాకపోగా.. అన్నిరకాలుగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తమ్ముడిపై ఎమ్మెల్సీ కక్షగట్టాడని.. హత్య వెనుక ఎమ్మెల్సీ ఇక్బాల్, పీఏ గోపికృష్ణపై అనుమానాలున్నాయని ఆరోపించారు. సీఎం జగన్ స్పందించి న్యాయం చేయాలని కోరారు.
రామకృష్ణారెడ్డి హత్యోదంతం అనంతపురం వైసీపీలో అలజడి సృష్టిస్తోంది. పార్టీలో గ్రూపు తగాదాలే రామకృష్ణారెడ్డి హత్యకు దారితీశాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో విభేదాలపై అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇవాళ మంత్రి పెద్దిరెడ్డి హిందూపూర్ వస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరాతీయనున్నారు మంత్రి. పార్టీలో గ్రూపు తగాదాలే కారణమా లేదా.. ఇతర కారణాలు ఉన్నాయా అన్నదానిపై దృష్టిసారించనున్నారు.
మరోవైపు.. రామకృష్ణారెడ్డి హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు పోలీసులు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, పీఏ గోపికృష్ణ, వరుణ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఏపీ వార్తల కోసం