Weather: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాలను వాన వదలడం లేదు. ఇప్పటికే తడిసి ముద్దైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఏపీలో రానున్న..
తెలుగు రాష్ట్రాలను వాన వదలడం లేదు. ఇప్పటికే తడిసి ముద్దైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఏపీలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు పడతాయని, అటు తెలంగాణలోనూ రెండు రోజులు రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిచింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో మరోసారి వరుణుడిని చూసి హడలిపోతున్నారు జనాలు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. పలు చోట్ల వర్షపునీరు రహదారులపై నిలిచిపోయింది.
అటు ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హర్యాణా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిశాయి. భరత్‌పూర్‌లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. నార్త్‌బెంగాల్‌లో కుండపోత వర్షాలకు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. మార్ నది పొంగిపొర్లడంతో కనీసం ఎనిమిది మంది మరణించారు. డార్జిలింగ్‌లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమాలయాల్లో కురిసిన భారీ వర్షాలకు డార్జిలింగ్, కలింపోంగ్‌లలోని పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నదని మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.
మరిన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..