CBN Polavaram: పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే.. నిర్మాణ పనులపై సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో ప్రతీ సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు బాబు. ప్రాజెక్టు పురోగతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

CBN Polavaram: పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్‌ సర్వే.. నిర్మాణ పనులపై సమీక్ష
Chandrababu Naidu Inspects Polavaram Project
Follow us

|

Updated on: Jun 17, 2024 | 12:15 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు నాయుడు. గతంలో ప్రతీ సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శిస్తున్నారు బాబు. ప్రాజెక్టు పురోగతి విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

పోలవరం స్టేటస్‌ రిపోర్ట్‌ ప్రకారం… మొత్తం ప్రాజెక్ట్‌ పనులు 50శాతం కూడా కంప్లీట్‌ కాలేదు. ఇప్పటివరకు 49.79శాతం ప్రాజెక్ట్‌ మాత్రమే పూర్తి అయ్యింది. హెడ్‌ వర్క్స్‌ పనులు 72.63శాతం, కుడి కాలువ 92.75శాతం పూర్తయ్యాయి. అలాగే, ఎడమ కాలువ పనులు 73.07శాతం పూర్తయ్యాయి. భూసేకరణ-పునరావాసం అయితే 22.55శాతం మాత్రమే జరిగాయి. ఇక, అప్రోచ్‌ ఛానెల్‌ పనులు 79శాతం కంప్లీట్‌ అయ్యాయి. స్పిల్‌వే పనులు 88శాతం పూర్తికాగా… పైలెట్‌ ఛానెల్‌ వర్క్స్‌ 48శాతం, రైట్‌-లెఫ్ట్‌ కనెక్టివిటీ 68శాతం పూర్తి అయ్యాయి

మొత్తం ప్రాజెక్ట్‌లో మూడు గ్యాప్స్‌ ఉంటే, గ్యాప్‌1 అండ్‌ గ్యాప్‌2లో డయాఫ్రమ్‌ వాల్‌ రిపేర్స్‌ జరుగుతున్నాయి. రెండు చోట్ల నేలను గట్టిపరిచే పనులు చేస్తున్నారు. ఇక, గ్యాప్‌3లో కాంక్రీట్‌ డ్యామ్‌ కంప్లీట్‌ అయ్యింది. హెలికాప్టర్‌ ద్వారా మొత్తం ప్రాజెక్ట్‌ను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు చంద్రబాబు. ఆ తర్వాత ప్రాజెక్ట్‌ సైట్‌కు నేరుగా వెళ్లి చెక్‌ చేశారు. స్పిల్‌వే, గైడ్‌బండ్‌, ఎగువ కాపర్‌ డ్యామ్‌, గ్యాప్‌1, గ్యాప్‌2, గ్యాప్‌3 నిర్మాణాలు, దిగువ కాపర్‌ డ్యామ్‌, పవర్‌ హౌస్‌ను స్వయంగా పరిశీలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..