AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్దమా కాదా..? అతనికి ఉన్న అధికారాలేంటి..?

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు సినిమాకు చెందిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఇదే రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 5 మందిని డిప్యూటీ సీఎంలను చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. గత 10 ఏళ్ల నుంచి ఈ రకమైన ట్రెండ్ తెరపైకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం చేసే ట్రెండ్ పెరిగింది.

డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్దమా కాదా..? అతనికి ఉన్న అధికారాలేంటి..?
Deputy Cm Pawan Kalyan
Srikar T
|

Updated on: Jun 17, 2024 | 2:37 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు సినిమాకు చెందిన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఇదే రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా 5 మందిని డిప్యూటీ సీఎంలను చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి. గత 10 ఏళ్ల నుంచి ఈ రకమైన ట్రెండ్ తెరపైకి వచ్చింది. వివిధ రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం చేసే ట్రెండ్ పెరిగింది. రాజకీయాల్లో డిప్యూటీ సిఎం పదవి రాజకీయంగా ఒక స్థాయిని పెంచేందుకు దోహదపడుతుంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో, సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తరుణంలో నాయకులకు ఈ పదవిని ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ పదవిని పార్టీలోని అత్యంత సీనియర్ నేతకు కూడా కేటాయించారు. డిప్యూటీ సీఎంకు ఎంత అధికారం ఉంటుంది. ఆయనకు ఉన్న హక్కులు ఏంటి, దీనిపై భారత రాజ్యాంగం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగంలో ఉందా?

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163(1) ప్రకారం, గవర్నర్ తన విధుల నిర్వహణలో సహాయం చేయడానికి లేదా సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని, ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమించి ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ విషయాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. కానీ డిప్యూటీ సీఎం పదవి గురించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావన లేదు. అందుకే డిప్యూటీ సీఎం పదవితో పాటు వివిధ శాఖలను కేటాయించి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు. తద్వారా అయనకు కూడా ప్రత్యేక ప్రోటోకాల్, భద్రత లభిస్తాయి.

సీఎంతో పోలిస్తే ఎంత పవర్ ఫుల్?

క్యాబినెట్ మంత్రుల మాదిరిగానే డిప్యూటీ సీఎం జీతం, ఇతర అలవెన్సులు పొందుతారు. అవసరమైతే ముఖ్యమంత్రి కొన్ని ప్రత్యేకమైన భద్రతను కేటాయించవచ్చు. జీతం విషయంలో కూడా అలాగే ఉంటుంది. రాష్ట్రంలోని క్యాబినెట్ మంత్రులకు సమానంగా పరిగణించబడతారు. డిప్యూటీ సీఎంకు నిర్దిష్టమైన ఆర్థిక లేదా పరిపాలనా అధికారాలు ఉండవు. ఆయనను కూడా ముఖ్యమంత్రి నియమిస్తారు. రాజకీయ సమీకరణాలు మారితే డిప్యూటీ సీఎంను తొలగించే లేదా భర్తీ చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది. ఉపముఖ్యమంత్రి అనే పదవికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు కనుక చట్టబద్ధంగా డిప్యూటీ సీఎం ఏమీ చేయలేరు. ఇక ర్యాంక్, అలవెన్సుల పరంగా డిప్యూటీ సీఎం పదవి కేబినెట్ మంత్రితో సమానం. కేబినెట్‌లో డిప్యూటీ సీఎం పదవి రెండో అత్యున్నత పదవిగా చెబుతూ ఉంటారు. రాజ్యాంగబద్ధమైన పదవి కానందున, దానికంటూ ప్రత్యేక పాత్ర, పని గురించి స్పష్టత ఇవ్వలేదు. వీరికి ఇతర కేబినెట్ మంత్రుల మాదిరిగానే శాఖలు కేటాయిస్తారు.

ఇది కేవలం రాజకీయ వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్న ఒక భాగం కాబట్టి ముఖ్యమంత్రి వద్దకు చేరే ప్రతి ఫైళ్లు డిప్యూటీ సీఎం ద్వారా వెళ్లేందుకు అవకాశం ఉండదు. అదే ప్రభుత్వ ఉద్యోగాల పరంగా చూస్తే ఏదైనా శాఖకు సంబంధించిన డైరక్టర్ వద్దకు ఫైల్ వెళ్లాలంటే డిప్యూటీ డైరక్టర్ ద్వారానే వెళ్తుంది. ముందు డిప్యూటీ డైరక్టర్ పరిశీలించిన తరువాత డైరక్టర్ వాటిని ఫైనల్ వెరిఫికేషన్ చేసి ఆమోదిస్తారు. డిప్యూటీ సీఎం తనకు బాధ్యతలు అప్పగించిన శాఖల ఫైళ్లను మాత్రమే చూస్తారు. మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పదవి రెండో అత్యున్నత పదవి అయినప్పటికీ, ఒక వేళ ముఖ్యమంత్రి ఏవైనా అనివార్యకారణాల వల్ల రాష్ట్రంలో లేకపోతే.. స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. ఒక వేళ వాటిని తీసుకున్నా అవి చెల్లుబాటు కావు. అయితే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే ముఖ్యమంత్రి స్థానంలో డిప్యూటీ సీఎం కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించవచ్చు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..