AP Election Results: కూటమి విక్టరీ వైపు నడిపించడంలో సామాజిక కాంబో ఫ్యాక్టర్ ఎంత?

ఏపీ రాజకీయాల్లో మిగతా ఆంశాల కంటే సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర. ఫలానా కులం వాళ్లు ఫలానా పార్టీ వైపు అనే మాటలు తరచూ వింటుంటాం. అదే కోవలో ఈసారి ఏపీలో ఓ రేంజ్‌లో వర్కవుటైంది కమ్మ-కాపు కాంబినేషన్. మొదట్లో డౌటనిపించినా, తర్వాత ఈ దోస్తీ సూపర్‌హిట్ అని తేలిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

AP Election Results: కూటమి విక్టరీ వైపు నడిపించడంలో సామాజిక కాంబో ఫ్యాక్టర్ ఎంత?
Pawan Kalyan Chandrababu Babu
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 04, 2024 | 6:54 PM

ఏపీ రాజకీయాల్లో మిగతా ఆంశాల కంటే సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర. ఫలానా కులం వాళ్లు ఫలానా పార్టీ వైపు అనే మాటలు తరచూ వింటుంటాం. అదే కోవలో ఈసారి ఏపీలో ఓ రేంజ్‌లో వర్కవుటైంది కమ్మ-కాపు కాంబినేషన్. మొదట్లో డౌటనిపించినా, తర్వాత ఈ దోస్తీ సూపర్‌హిట్ అని తేలిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ఎంతో కష్టం అనుకున్నారో ఏమో.. ఒకే వేదిక మీదికొచ్చి, ఒకే కాజ్‌ కోసం పోరాడారు చంద్రబాబు-పవన్‌కల్యాణ్. కానీ.. వీళ్ల వెంట వీళ్ల సామాజికవర్గాలు కూడా నడిచొచ్చాయా? కూటమిని విక్టరీ వైపు నడిపించడంలో కమ్మ-కాపు కాంబో ఫ్యాక్టర్ ఎంత?

తెలగ, బలిజ, ఒంటరి లాంటి అనేక ఉపకులాలున్న కాపులు ఏపీలో 24 శాతానికి పైగా ఉన్నట్టు సెన్సస్ లెక్కలు చెబుతున్నాయి. వీరికి ఐదు శాతం కమ్మ సామాజికవర్గం ఓట్లు కలిస్తే.. అది ఫలితం మీద పెనుప్రభావం చూపకుండా ఉంటుందా? అందుకే, వైసీపీని అంతలా టెన్షన్ పెట్టేసింది కాపు-కమ్మ కెమిస్ట్రీ.

జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినంత మాత్రాన కమ్మ-కాపు సామాజిక వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందా..? అనే సందేహం అందరిలో ఉండేది. ఈ కాపురం సజావుగా జరిగే అవకాశమే లేదని వైసీపీ చెబుతూనే వస్తోంది. కాపు కమ్యూనిటీ మొత్తాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టారంటూ పవన్‌ని టార్గెట్ చేస్తూ.. తీవ్ర విమర్శలకు దిగింది వైసీపీ. పవన్‌కల్యాణ్‌ ముఖ్యమంత్రి పోస్టు మీద, పవర్ షేరింగ్ మీద పట్టు పట్టకపోవడం, ఎక్కువ సీట్లు తీసుకోకపోవడం సరైంది కాదని కొందరు కాపు పెద్దలు వాదించారు. సహజంగానే ఈ గ్యాప్‌ని ఎడ్వాంటేజ్‌గా తీసుకుని, పవన్‌కల్యాణ్‌కి అన్యాయం జరుగుతోందని, అవమానం జరుగుతోందని పనిగట్టుకుని ప్రచారం మొదలుపెట్టింది వైసీపీ. ముద్రగడ లాంటి నేతల్ని పార్టీలో చేర్చుకోవడం కూడా అందులో ఒక ఎత్తుగడ.

కానీ.. అధికార పార్టీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ రెండు పార్టీల నాయకుల మధ్య సమన్వయం పెరగడం, కాపు-కమ్మ ఓట్ల ట్రాన్స్‌ఫర్ సవ్యంగా జరగడం కనిపించింది. గోదావరి బెల్ట్‌తో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీగా కాపులు కూటమి అభ్యర్థులకు ఓట్లేశారు అనేది వైసీపీ లీడర్ల అంచనా. రాయలసీమకు చెందిన బలిజ ఓట్లు కూడా గంపగుత్తగా కూటమి ఖాతాలో పడ్డాయి.

ఈ స్థాయిలో కాపులు కూటమికి ఓట్లేస్తారని భావించనే లేదని, ఇది ఫలితంపై ప్రభావితం చేయవచ్చని పోలింగ్ రోజే నిర్ధారణకొచ్చింది వైసీపీ. ఈ రెండు సామాజికవర్గాలు కలిసి పరస్పర సహకారంతో ఇంత కసిగా పనిచేయడం గతంలో ఎప్పుడూ జరగలేదు. కమ్మ-కాపు మధ్య క్యాస్ట్ డైనమిక్స్‌ని వర్కవుట్ చెయ్యడంలో కూటమి నేతలు సక్సెస్ కొట్టారనడానికి తాజా ఫలితాలే నిదర్శనం..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..