AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan : కొత్త ప్రభుత్వంపై టాలీవుడ్ సెలబ్రెటీల ట్వీట్స్.. పవన్, చంద్రబాబు విజయంపై ఆర్జీవీ రియాక్షన్ ఇదే..

ముఖ్యంగా పవన్ విజయంతో టాలీవుడ్ సెలబ్రెటీస్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. జనసేన అధినేతకు, చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రేణూ దేశాయ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, ప్రొడ్యూసర్ నాగవంశీ, నిర్మాత ఎస్కేఎన్, కాజల్ అగర్వాల్ విషెస్ చెబుతూ ట్వీట్స్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రవితేజ, రామ్ పోతినేని, మోహన్ బాబు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవన్ , చంద్రబాబు విజయం పై స్పందించారు.

Pawan Kalyan : కొత్త ప్రభుత్వంపై టాలీవుడ్ సెలబ్రెటీల ట్వీట్స్.. పవన్, చంద్రబాబు విజయంపై ఆర్జీవీ రియాక్షన్ ఇదే..
Rgv, Chandrababu, Pawan Kal
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2024 | 8:38 PM

Share

ఆంధ్రప్రదేశ్‏లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ గెలవడంతో సినీ పరిశ్రమలో ఘనంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పవన్ విజయంతో టాలీవుడ్ సెలబ్రెటీస్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. జనసేన అధినేతకు, చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రేణూ దేశాయ్, సాయి ధరమ్ తేజ్, నితిన్, ప్రొడ్యూసర్ నాగవంశీ, నిర్మాత ఎస్కేఎన్, కాజల్ అగర్వాల్ విషెస్ చెబుతూ ట్వీట్స్ చేశారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రవితేజ, రామ్ పోతినేని, మోహన్ బాబు, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పవన్ , చంద్రబాబు విజయం పై స్పందించారు.

ముఖ్యంగా పవన్, చంద్రబాబు గెలుపు పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ లను ట్యాగ్ చేశాడు. అలాగే మోహన్ బాబు రియాక్ట్ అవుతూ.. అద్భుత విజయం సాధించారు. ఇక మీ నాయకత్వంలో ఏపీ అనేది అభివృద్దిలో దూసుకుపోతుంది అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణలకు కంగ్రాట్స్ చెప్పాడు.

అలాగే మాస్ మాహరాజా రవితేజ రియాక్ట్ అవుతూ.. పిఠాపురంలో గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్. మీ జర్నీ అద్భుతంగా.. ఎన్నో కష్టాలని ఎదుర్కొని నిలబడ్డారు. ఇక మీ ప్రజా సేవ దిగ్విజయంగా సాగాలాని అందరిలోనూ స్పూర్తి నింపాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

చంద్రబాబుగారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గార్లకు కంగ్రాట్స్. పిఠాపురంలో గొప్ప చరిత్రను సృష్టించారు. ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అంటూ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

ఏపీ ప్రజలు మాట్లాడారు. తీర్పునిచ్చారు.. చంద్రబాబు గారు, బాలయ్యగారు, నారా లోకేష్ గార్లకు కంగ్రాట్స్.. పవన్ కళ్యాణ్ గారికి సెలబ్రేట్ చేసుకునే రోజు వచ్చింది. ఎప్పుడో రావాల్సిన విజయం ఇది. ప్రజా ప్రభుత్వం ఎదురుచూస్తున్నాం అంటూ ట్వీట్ చేశాడు రామ్ పోతినేని.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్