Antarvedi: అంతర్వేది సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి.. నీరు 2 కిలో మీటర్లు లోనికి వెళ్లడంతో స్థానికుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం వింత పరిస్థితి నెలకొంది. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా.. కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది.

Antarvedi: అంతర్వేది సముద్ర తీరంలో విచిత్ర పరిస్థితి.. నీరు 2 కిలో మీటర్లు లోనికి వెళ్లడంతో స్థానికుల ఆందోళన
Antarvedi Sea
Follow us
Balaraju Goud

| Edited By: Anil kumar poka

Updated on: Aug 25, 2021 | 9:03 PM

Antarvedi Bay of Bengal Sea Waves: బంగాళాఖాతంలో గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కాగా.. గత కొద్ది రోజులుగా అంతర్వేది వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొస్తోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు ప్రజలను భయపెడుతున్నాయి.

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్ర తీరం వింత పరిస్థితి నెలకొంది. నిన్న అలలు పోటెత్తి సాగరం ముందుకు చొచ్చుకుని రాగా.. కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలో సాగరుడు భయపెడుతున్నాడు. కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు.. అది కూడా కూతవేటు దూరంలోనే కిలోమీటర్ల మేర భిన్నమైన మార్పులు వస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు.

గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు వచ్చే సముద్రం .. గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రం ముందుకు రావడంతో.. తీరమంతా మునిగిపోయి.. నీరే కనిపిస్తోంది. ఫలితంగా సముద్రం ఒడ్డున నిర్మించిన షాపులు కూలిపోయాయి.

వారం రోజుల క్రితం సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. ఇప్పటి వరకు సముద్రం 45 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. అలల తాకిడి కారణంగా సముద్రం ఒడ్డున ఉన్న భవనం ధ్వంసమైంది. అలల ఉధృతికి కింద నేల కొట్టుకుపోవడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 20 ఏళ్లకోసారి సముద్రం ఇలా ముందుకు వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు. అంతర్వేది వద్ద సముద్రం ముందుకు వస్తుండగా.. ఇక్కడికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ తీరం వద్ద సముద్ర జలాలు వెనక్కి వెళ్లడం గమనార్హం.

అయితే, అంతర్వేదిలో అన్నాచెల్లెలి గట్టు అంటే చాలా ఫేమస్. ఇప్పుడక్కడ సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. మరో కొన్ని చోట్ల సముంద్ర ఏడారి దీవులను తలపిస్తోంది. అనుహ్యంగా రెండు రోజుల వ్యవధలో చోటుచేసుకుంటున్న మార్పులతో సముద్ర తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతన్నారు. ఈ పరిణామాలు.. ఏదైన ఉప్పెనకు సంకేతమా అని స్థానికులు బయపడుతున్నారు.

సముద్రం ముందుకు వచ్చిన ఘటనలు…

1. అక్టోబర్‌ 11, 2014 విశాఖ జిల్లా రాజయ్యపేట వద్ద 60 అడుగులు ముందుకు వచ్చిన సముద్రం 2. జూన్‌13, 2018 శ్రీకాకుళం జిల్లాలో 100 అడుగులు ముందుకు వచ్చింది. అదే రోజు విజయనగరం జిల్లా ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు 3. అక్టోబర్‌ 11, 2018 శ్రీకాకుళం జిల్లా కొత్తపాలెం వద్ద 30 మీటర్లు ముందుకు వచ్చింది. 4. డిసెంబర్‌ 18,2018 మంగినపూడిలో 20 మీటర్ల మేర ముందుకు.. 5. మే 2, 2019 విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ముందుకు వచ్చిన సముద్రం. 6. మే 19, 2020 కోస్తాలో 30 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం. 7. మే 25, 2020 తూర్పు గోదావరి జిల్లా కేశవదాసుపాలెంలో 2 కి.మీ. ముందుకు వచ్చిన సముద్రం 8. నవంబర్‌ 27, 2020 హంసలదీవి వద్ద 20 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం

Read Also… Andhra Pradesh: రెచ్చిపోయిన కానిస్టేబుళ్లు.. బీరు బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!

సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ 4 ఆహారాలను తరచుగా తినండి..