AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రెచ్చిపోయిన కానిస్టేబుళ్లు.. బీరు బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Andhra Pradesh: ఎవరి మధ్య అయినా ఘర్షణ చోటు చేసుకుంటే వారు మొదటగా వెళ్లేది పోలీస్ స్టేషన్‌కే. కారణం.. పోలీసులు తమ సమస్యను పరిష్కరిస్తారని,

Andhra Pradesh: రెచ్చిపోయిన కానిస్టేబుళ్లు.. బీరు బాటిళ్లతో ఒకరిపై మరొకరు దాడి.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Clashes
Shiva Prajapati
|

Updated on: Aug 25, 2021 | 4:20 PM

Share

Andhra Pradesh: ఎవరి మధ్య అయినా ఘర్షణ చోటు చేసుకుంటే వారు మొదటగా వెళ్లేది పోలీస్ స్టేషన్‌కే. కారణం.. పోలీసులు తమ సమస్యను పరిష్కరిస్తారని, తమకు న్యాయం చేస్తారని. మరి ప్రజలకు అండగా, ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులే రోడ్డుకెక్కి రచ్చ చేస్తే.. తమలో తాము కొట్టుకుంటే.. అది చూసిన జనాల్లో పోలీసుల పట్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది?..

తాము ప్రభుత్వ ఉద్యోగులం, బాధ్యత గల విధుల్లో ఉన్నాం అనే విచక్షణ, జ్ఞానం మరిచి ఇద్దరు పోలీసులు పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు. ఏకంగా బీరు సీసాలతో తలలపై కొట్టుకుని భీతావహ పరిస్థితిని సృష్టించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం జువ్వలపాలెంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మురళి, సుబ్బారావు అనే కానిస్టేబుళ్లు ఆకివీడు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలోనే.. జువ్వలపాలెంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ క్రమంలో పరస్పరం.. బాహాబాహీకి దిగారు. బీరు సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరికీ స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, మురళి, సుబ్బారావు కానిస్టేబుళ్లు ఇద్దరూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Siddipet Suicide: భర్తను కాదని ప్రియుడితో కలిసి ఉన్న వివాహిత.. గదికి తాళం వేసిన అత్తా.. తీరా ఎం జరిగిందంటే..?

అడుగడునా అడ్డంకులే.. అన్నింటికి మించి సోదరున్ని కోల్పోయాం.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన మేకర్స్..

Vegetables: ఈ 5 రకాల కూరగాయలు మనిషికి చాలా అవసరం..! ప్రతిరోజు తినండి ఆరోగ్యంగా ఉండండి..