Siddipet: భర్తను కాదని ప్రియుడితో కలిసి ఉన్న వివాహిత.. గదికి తాళం వేసిన అత్త.. తీరా ఎం జరిగిందంటే..?

తప్పుడు ఆలోచనలు, తప్పుడు దారులు కుటంబాలను నాశనం చేస్తున్నాయి. క్షణికానందం కోసం బంధాలనే కాదనుకుంటున్నారు.

Siddipet: భర్తను కాదని ప్రియుడితో కలిసి ఉన్న వివాహిత.. గదికి తాళం వేసిన అత్త.. తీరా ఎం జరిగిందంటే..?
Suicide
Balaraju Goud

|

Aug 25, 2021 | 4:58 PM

Siddipet couple Suicide: తప్పుడు ఆలోచనలు, తప్పుడు దారులు కుటంబాలను నాశనం చేస్తున్నాయి. క్షణికానందం కోసం బంధాలనే కాదనుకుంటున్నారు. భర్తను లేదా భార్య అనే కుటుంబ బంధాలను పక్కన పెట్టి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్న వారు చివరకు సామాజిక బంధాలకు విలువ ఇస్తూ ప్రాణాలను త్రుణ ప్రాయంగా వదిలేస్తున్నారు. దీంతో వారిపై ఆశలు పెట్టుకున్న కుటంబాలు, వారిమీద ఆధారపడిన పిల్లలు అభాగ్యాలుగా మిగులుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సిద్దిపేట జిల్లా తంగళ్లపల్లి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల శివ, 25 సంవత్సరాల శీరిషలకు గత కొన్ని సంవత్సరాల క్రితమే వివాహం అయింది. ఇద్దరి కాపురం అన్యోన్యంగానే కొనసాగుతోంది.. అయినా శిరీష మనస్సు వక్ర మార్గంలోకి వెళ్లింది. భర్తను కాదని తన ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే, ఇవేమి తెలియన శివ తన రోజువారి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరి విషయాలు కుటుంబానికి తెలిసింది. దీంతో ఇద్దరిని మందలించి వదిలేశారు.

అయితే, కొన్ని రోజులపాటు దూరంగా ఉన్న వీరిద్దరూ.. ఇటివల శిరీష భర్త బయటి పనిమీద వెళ్లాడు. రాత్రి ఇంటికి రానని శిరీషతో చెప్పాడు. దీంతో ఇదే అవకాశంగా భావించిన జంట.. తన అత్తమామ ఇంట్లోనే ఉండగానే అతన్ని ఇంటికి పిలిచింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి శ్రీకాంత్‌.. శిరీష ఇంటికి వచ్చాడు. అయితే ఒకే గదిలో ఉన్న ఇద్దరి చూసిన శీరిష అత్త వెంటనే అప్రమత్తమైంది. తన కొడలు ఇలా చేయడం భరించలేని ఆమె వెంటనే ఆ ఇద్దరు ఉన్న గదికి బయట నుండి గొళ్లెం పెట్టింది. ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని పలిచింది.. మరోవైపు తన కొడుకు శివ వచ్చే వరకు వారిని అలాగే గదిలో బంధించింది. తెల్లవార్లు వారిద్దిని అదే గదిలో నిర్భంధించింది.

దీంతో అవాక్కయిన.. అక్రమ జంటకు చుక్కలు కనిపించాయి. దీంతో తమ గురించి అందరికీ తెలిసి పరువు పోతుందని భావించి జంట.. బతకడం ప్రయోజనం లేదని భావించారు. వెంటనే రాత్రి పదకొండు గంటలకు ఫ్యానుకు ఉరేసుకుని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇద్దరిని రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్న వారు ఉదయం తలుపులు తీసే సరికి ఇద్దరు విగత జీవులై పడి ఉన్నారు. ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఎవరి పనుల్లో వారు బిజీ.. ఇదే ఛాన్స్ అని భావించిన పెళ్లి కూతురు ఉన్నపళంగా జంప్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu