Andhra Pradesh: మరికొన్ని గంటల్లో పెళ్లి.. నవ వధువు చేసిన పనికి బంధువులంతా షాక్.. ఏం జరిగిందంటే..
Andhra Pradesh: ఓ వధువు చేసిన పనికి పీఠల మీద పెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగింది. వివరాల్లోకెళితే..
Andhra Pradesh: ఓ వధువు చేసిన పనికి పీఠల మీద పెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో జరిగింది. వివరాల్లోకెళితే.. మదనపల్లికి చెందిన రామాంజనేయులుకి, అదే ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. మదనపల్లిలోని అరవేణి ఫంక్షన్ హాల్‌లో ఇవాళ వివాహం జరగాల్సి ఉంది. కాగా, ఇవాళ కళ్యాణ మండపానికి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ చేరుకున్నారు. వధూవరుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెళ్లి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
అయితే, ఇదే ఛాన్స్‌గా భావించిన పెళ్లి కూతురు.. కళ్యాణ మండపం నుంచి పరారైంది. పెళ్లి కూతురు ఉన్నపళంగా అదృశ్యం కావడంతో.. వివాహం నిలిచిపోయింది. దాంతో వరుడు తరఫున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను మోసం చేశారంటూ పెళ్లి కూతురు, ఆమె కుటుంబ సభ్యులపై మదనపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అదృశ్యమైన వధువు కోసం గాలిస్తున్నారు. ఆ యువతి ఎందుకలా చేసిందనే దానిపై ఆరా తీస్తున్నారు.
Also read:
IND vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. రెండు మార్పులతో బరిలోకి ఇంగ్లాండ్..
Aarya: చీటింగ్ కేసు నుంచి హీరో ఆర్యకు ఉపశమనం.. అసలు దొంగలను పట్టుకున్న పోలీసులు..
Benefits of Beer: బీర్ తాగడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు.. తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు..