AP Schools: ఆ ప్రాంతాల్లో పాఠశాలలు తెరవద్దు.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..
AP Schools Re-Open: ఆన్‌లైన్ క్లాసులు ప్రత్యామ్నాయం మాత్రమేనని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాఠశాలలు, కాలేజీలు తెరిచాక..
ఆన్‌లైన్ క్లాసులు ప్రత్యామ్నాయం మాత్రమేనని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాఠశాలలు, కాలేజీలు తెరిచాక కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా టీవీ9 ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదిమూలపు సురేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లోని కొన్ని పాఠశాలలలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి వాస్తవమేనని ఆయన తెలిపారు. 10 కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభించవద్దని గతంలోనే ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
అలాగే పాఠశాలలు, కాలేజీల్లో ఫీజులకు సంబంధించి 53, 54 జీవోలను జారీ చేశామని పేర్కొన్నారు. ఎవరైనా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఆగష్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో పేరెంట్స్ టెన్షన్ పట్టుకుంది.