YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉత్తర భారత పర్యటన.. ఎప్పటి నుంచంటే..?
రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర భారత పర్యటన చేయనున్నారు...
ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర భారతదేశం పర్యటించనున్నారు. నిత్యం రాజకీయ వ్యవహారాలు, వీడియో కాన్ఫరెన్స్‌లతో బిజీబిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్.. రేపట్నుంచి ఐదు రోజుల పాటు కుటుంబంతో సిమ్లా వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు.
మధ్యాహ్నం 1 గంటకు గన్నవరం నుంచి చండీగఢ్‌కు బయల్దేరుతారు. ఇక సాయంత్రం 4 గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకుంటారు. ఈ నెల 28వ తేదీన సీఎం వైఎస్ జగన్-భారతిల పెళ్లి రోజు. వారికి వివాహమై 25 ఏళ్లు అవుతోంది. మ్యారేజ్ డే పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్తున్నారు.