AP Rains: ఏంటి సుధా ఈ వర్షాలు.! ఏపీలో ఈ ప్రాంతాలకు కుండబోత తప్పదా.? తాజా వెదర్ రిపోర్ట్
ఏపీకి వర్షాల ముప్పు ఇంకా తగ్గలేదా.? మరో అల్పపీడనం పొంచి ఉందట. వచ్చే 3 రోజులు వాతావరణ సూచనలు ఇలా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్
నిన్నటి మధ్య అండమాన్ సముద్రం ఆనుకుని ఉన్న గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ ప్రాంతంలో నున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అనగా 14 డిసెంబర్ 2024 ,ఉదయం 0830 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో, డిసెంబర్ 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి రెండు రోజులలో బాగా గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య /తూర్పు గాలులు వీస్తున్నాయి.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : —————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- —————————————-
ఈరోజు, రేపు:-
వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .
ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ——————————
ఈరోజు,రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ:-
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..