AP Weather: ఆహా.. ఇక దండిగా వర్షాలు… ఇదిగో ఏపీ వెదర్ రిపోర్ట్
రైతన్నలూ ఇక వ్యవసాయ పనులకు సిద్దం కండి. బుధవారం నుంచి ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి...

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. ఇక దండిగా వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, నంద్యాల, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో.. మోస్తారు వర్షం కురుస్తుందని.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
————————————
ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
మంగళవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-
——————————–
ఆదివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
సోమవారం, మంగళవారం ;- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ :-
—————-
ఆదివారం :-తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది .
సోమవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
మంగళవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
