Andhra Pradesh: మరోసారి సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్‌.. ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌లో దేశంలోనే టాప్‌..

Andhra Pradesh: ఆంధప్రదేశ్‌ రాష్ట్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా కేంద్రం ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. గతంలో ఈ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో...

Andhra Pradesh: మరోసారి సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్‌.. ఈజ్‌ ఆప్‌ డూయింగ్‌లో దేశంలోనే టాప్‌..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 30, 2022 | 1:24 PM

Andhra Pradesh: ఆంధప్రదేశ్‌ రాష్ట్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా కేంద్రం ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. గతంలో ఈ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో నిలిచిన ఏపీ మరోసారి టాప్‌ ప్లేస్‌లో నిలవడం విశేషం. బిజినెస్‌ రిఫార్మ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2020లో ఆంధ్రప్రదేశ్‌ తొలి స్థానంలో నిలిచింది.

తాజాగా టాప్‌ అవిచరవ్స్‌లో కేంద్రం 7 రాష్ట్రాల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం మొత్తం 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ జాబితాలో ఏపీ టాప్‌ అచివర్స్‌లో స్థానం దక్కించుకుంది. ఇదిలా ఉంటే 2019 అక్టోబర్‌ నుంచి 2021 డిసెంబర్‌ వరకు రాష్ట్రంలో ఏపీ భారీగా విదేశీ పెట్టబడులను ఆకర్షించి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన విషయం తెలిసిందే. ఏకంగా 451 మిలియన్‌ డార్ల విదేశీ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 974 కి.మీ. మేర దేశంలో రెండో పొడవైన తీర ప్రాంతం ఉండటం, రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉండడమే పెట్టుబడులకు కారణమని ఇన్వెస్ట్ ఇండియా అప్పట్లో తెలిపింది.

Ap

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..