AP Weather: ఏపీ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడ గాలులు..
AP Weather: మార్చి మిడిల్ నాటికే ఎండలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా...
AP Weather: మార్చి మిడిల్ నాటికే ఎండలు దంచికొడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది.
ఈ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలకు గాను బుధవారం మూడు మండలాల్లో తీవ్ర వడ గాలులు వీయగా, 43 మండల్లాల్లో వడగాలులు వీచాయి. తీవ్ర వడగాలులు వీచిన 3 మండలాలు విశాఖపట్నంలోనే ఉండడం గమనార్హం. ఇక రానున్న 24 గంటల్లో (17-03-2022) రాష్ట్రంలోని 8 మండల్లాల్లో తీవ్ర వడగాలులు, 93 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రానున్న 48 గంటల్లో (18-03-2022) రాష్ట్రంలోని 13 మండలాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. గురువారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఈ జిల్లాలు ఇవే.. విజయనగరం (2), తూర్పుగోదావరి (01), కృష్ణా (03), గుంటూరు (02) మండలాల్లో తీవ్ర వడ గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మండలాల వారీగా పూర్తి వాతావరణ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: వెండితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో తెలుసా!
Hyderabad: ప్రముఖ సింగర్ బలవన్మరణం.. ఉరివేసుకొని ఆత్మహత్య..
Nail Biting Habit: మీకు కూడా గోళ్లు కొరికే అలవాటు ఉందా? ఈ అలవాటును ఎలా వదిలించుకోవాలో తెలుసా..