AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన.. వారికి ఆర్టీసీ బస్సుల్లో రాయితీ

త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడుతామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.  

Andhra Pradesh: ఏపీ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన.. వారికి ఆర్టీసీ బస్సుల్లో రాయితీ
Apsrtc
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 16, 2022 | 5:44 PM

Apsrtc: కరోనా వ్యాప్తి నేపథ్యంలో 60ఏళ్లు దాటిన వృద్ధులకు(senior citizens) ఆర్టీసీ నిలిపివేసిన 25శాతం రాయితీని  ఏప్రిల్​ నుంచి తిరిగి అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని(Perni Nani) వెల్లడించారు.  ఆధార్‌, రేషన్ కార్డు, ఓటరు ఐడీ, పాన్ కార్డు లాంటి ఏదైనా గుర్తింపు కార్డు చూపించి వయసు నిర్ధారణ చేసుకుని రాయితీ పొందవచ్చని తెలిపారు.  ఇక త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడుతామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.  1,800 మందికి కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు మిగిలిన శాఖల్లో భర్తీ చేయాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కారుణ్య నియామకాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. కలెక్టర్లు అదే పనిలో ఉన్నారని తెలిపారు. ఆర్టీసీ బస్సుల కోసం ఆయిల్  కంపెనీల నుంచి నెలకు 8లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. చమురు కంపెనీల నుంచి కొనుగోలు చేసే డీజిల్ ధరలో చేంజస్ వచ్చాయన్నారు. గతంలో రూ.15 వరకు తేడా ఉండేదని, ఇప్పుడు బయటి బంకుల్లోనే తక్కువ రేటుకు దొరుకుతుందన్నారు.

దీంతో బయటి బంకుల్లో డీజిల్‌ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ.1.50కోట్లు సేవ్ అవుతుందన్నారు. బయటి బంకుల్లో డీజిల్‌ కొనుగోలు చేయడం వల్ల నెలకు రూ.33.83కోట్లు ఆదా అయ్యిందని మంత్రి వివరించారు. తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, నెల్లూరుకు తొలుత ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని మంత్రి చెప్పారు.

Also Read: Telangana: ప్రేమికుడి బొమ్మ గీసి చనిపోయిన ప్రియురాలు.. పాపం బాధను తట్టుకోలేక