AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రేమికుడి బొమ్మ గీసి చనిపోయిన ప్రియురాలు.. పాపం బాధను తట్టుకోలేక

నాలుగేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లి పేరెత్తగానే వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. దీంతొ పెద్ద మనుషుల పంచాయితీ పెట్టి.. 6 నెలలు గడువు పెట్టడంతో వారిని నమ్మంది.. కానీ..

Telangana: ప్రేమికుడి బొమ్మ గీసి చనిపోయిన ప్రియురాలు.. పాపం బాధను తట్టుకోలేక
Young Girl Suicide
Ram Naramaneni
|

Updated on: Mar 16, 2022 | 5:23 PM

Share

Mahabubabad: ప్రేమించిన వ్య‌క్తి పెళ్లికి నిరాక‌రించాడ‌ని మనస్తాపానికి గురైన ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ‘అమ్మా.. నాన్నా మ‌ళ్లీ మీ ముందు ఓడిపోయా.. అంద‌రి ముందు ప్ర‌శ్న‌గా మిగిలిపోయా.. పెద్ద మ‌నుషుల స‌మ‌క్షంలో మ‌ళ్లీ ఆరెల్ను గ‌డువు పెడితే త‌న‌ను న‌మ్మి మ‌రోసారి ఓడిపోయా. ఏం చేయాలో అర్థంకావట్లేదు.. నాకు బ‌త‌కాల‌ని లేదు’ అంటూ ఆ యువ‌తి సూసైడ్ నోటులో రాసింది. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి…  దంతాలపల్లి మండలం(Danthalapally Mandal) పెద్దముప్పారం గ్రామానికి చెందిన అమ్మాయి అదే గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు నాలుగేళ్లు గడిచింది. విషయం ఇరువురి పెద్దలకు తెలిసింది. దాంతో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. కాగా, అబ్బాయి తరపువాళ్లు వివాహనికి ఆరునెలల గడువు కోరారు. అత‌డు చెప్పిన స‌మ‌యం కూడా అయిపోయినా, అత‌డు మాత్రం పెళ్లి చేసుకునేందుకు మ‌రో ఆరు నెల‌ల స‌మ‌యం కావాల‌ని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో.. సూసైడ్ నోటు రాసి, ప్రియుడి బొమ్మ‌గీసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. కాగా.. యువతి మృత‌దేహాన్ని యువకుడి ఇంటి ముందుకు తీసుకొచ్చి బంధువులు ఆందోళన చేశారు. ప్రేమించిన యువతి ప్రాణాలను బలిగొన్న యువకుడిని, పెళ్లికి వాయిదాలు వేస్తూ తీర్పుచెప్పిన పెద్దమనుషులను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిరుపేద యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ప్రియుడు పెద్దమనుషుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని, తన కుమార్తె మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Also Read: చేపలు చిక్కుతాయని వల వేస్తే ఇవి దొరికాయ్.. జాలర్లకు పండగే పండుగ.. కేజీ ధరెంతో తెలిస్తే కంగుతింటారు