Telangana CLP: దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష.. సోనియా, రాహుల్ నాయకత్వాన్ని బలపరుస్తూ సీఎల్పీ తీర్మానం
సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బుధవారం అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేశంలో గాంధీ కుటుంబం నాయకత్వమే కాంగ్రెస్‌కు శిరోధార్యమని అభిప్రాయపడ్డారు.
Telangana CLP: సోనియా(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బుధవారం అసెంబ్లీ సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLA) దేశంలో గాంధీ కుటుంబం నాయకత్వమే కాంగ్రెస్‌కు శిరోధార్యమని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ,రాజ్యాంగం పరినవిల్లాలి అంటే సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని అకాంక్షించారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయా పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణ గురించి జరిగిన చర్చ హాట్ హాట్‌గా సాగింది.
తెలంగాణ శాసనసభా పక్షం ప్రత్యేకంగా సమావేశమైంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు బుధవారం అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరు అయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్‌పై డిస్కర్షన్ చేసినట్లు సమాచారం. అలాగే, ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడం. జాతీయ స్థాయిలో సీనియర్లు తిరుగుబాటు చేస్తుండటంతో.. నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
దేశంలో ప్రస్తుతం అనేకరకాలైన విధ్వంసకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. సంపదను ప్రైవేటు శక్తులకు అప్పగించడం.. మత ఛాందస భావాలు.. మతతత్వ వాదనతో జాతిని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశానికి గాంధీ కుటుంబమే శ్రీరామరక్ష అన్నారు. భారతదేశాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బాధ్యతలు చేపట్టాలని.. ఈ మేరకు ఐఏసీసీకి తీర్మానం ప్రతులు పంపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాహుల్ గాంధీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమని, దేశం కోసం, పార్టీ కోసం రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలన్నారు. 1970లలో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నా..1980లో అనూహ్యంగా పుంజుకుంది.. అదే రీతిలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జీ- 23 నేతలు గాంధీ కుటుంబంపై చేస్తున్న తిరుగుబాటును సీఎల్పీ సమావేశం ఖండించింది. గాంధీ కుటుంబమే కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు వహించాలని సీఎల్పీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ మేరకు ఏక వాక్య తీర్మానం చేస్తూ ఢిల్లీకి లేఖ రాశారు. జీ-23 నేతల్లో ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని భట్టి పేర్కొన్నారు. అలాగే ఐదు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ తెలంగాణ కాంగ్రెస్‌పై ఏమాత్రం పడవని భట్టి స్పష్టం చేశారు. 2023లో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని భట్టి ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే, సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర పాలిటిక్స్ కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ సీనియర్లు మర్రి శశిధర్ రెడ్డి నివాసలంలో భేటీ అంశం కూడా చర్చకు వచ్చింది. సీనియర్ల సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లడం.. పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఉన్న ఆరుమందిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయట. సో.. మొత్తంగా సీఎల్పీ సమావేశం కాస్త హాట్ హాట్‌గా జరిగినా.. పైకి మాత్రం కూల్‌గా ముగించేశారు. సింగిల్ ఎజెండాగా రాహుల్, సోనియాగాంధీకి అండగా నిలుస్తూ తీర్మానం చేసి పంపించారు.
Read Also…