Vizag: చేపలు చిక్కుతాయని వల వేస్తే ఇవి దొరికాయ్.. జాలర్లకు పండగే పండుగ.. కేజీ ధరెంతో తెలిస్తే కంగుతింటారు..
సాంప్రదాయ మత్స్యకారులు రోజంతా కష్టపడితే.. వారికి దక్కే ఫలితం అంతంత మాత్రమే. నడిసంద్రంలో ప్రాణాలకొడ్డి వేట సాగించే మత్స్యకారులకు కొన్ని సందర్భాల్లో కష్టమే మిగులుతుంది.
సాంప్రదాయ మత్స్యకారులు రోజంతా కష్టపడితే.. వారికి దక్కే ఫలితం అంతంత మాత్రమే. నడిసంద్రంలో ప్రాణాలకొడ్డి వేట సాగించే మత్స్యకారులకు కొన్ని సందర్భాల్లో కష్టమే మిగులుతుంది. కానీ.. అరుదైన మత్స్య సంపద దొరికితే ఆ ఆనందమే వేరు. అప్పటివరకు పడ్డ కష్టమంతా మర్చిపోతారు. విశాఖ జిల్లాలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ పరిమాణంతో.. ఆకర్షించే రంగుతో ఉండే రొయ్యలు చిక్కాయి. సాంప్రదాయ మత్స్యకారులకు అరుదుగా దొరికే ఈ రొయ్యలతో ఆ మత్స్యకారులకు అదృష్టం కలిసి వచ్చినట్లయింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం(Atchutapuram Mandal) పూడిమడక(Pudimadaka)లో వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ కాయంతో ఉన్న లాబ్ స్టర్ రొయ్యలు చిక్కాయి. సాధారణంగా రాళ్ల మధ్య నివసించే ఈ రొయ్యలు మత్స్యకారులకు చిక్కడం అరుదు. అది కూడా సాంప్రదాయ మత్స్యకారులకు చిక్కడం అంటే గగనమే. అయితే.. అదృష్టం కలిసొచ్చి మత్స్యకారులకు పలకరించాయి ఈ రొయ్యలు. సాధారణ రొయ్యలతో పోలిస్తే పొడవాటి మీసాలు, భారీ కాయం ఉంటుంది. ఈ లాబ్ స్టర్ రొయ్యలను కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ గా పిలుస్తుంటారు. సాధారణ రొయ్యలతో పోలిస్తే వీటి ధర చాలా ఎక్కువ. కిలో 1500 రూపాయల వరకు పలుకుతుంది. బరువు కూడా కిలోన్నర నుంచి మూడు కిలోల వరకు ఉంటుంది. అమెరికా, జపాన్, చైనా లాంటి దేశస్తులు ఈ లాబ్ స్టార్ రొయ్యలను ఇష్టంగా తింటారు. అందుకే ఆయా దేశాల్లో వీటి భారీ డిమాండ్ కూడా ఉంది. మన సముద్రంలో దొరికే ఈ రొయ్యలను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కెనడాలో అత్యధికంగా లభించే ఈ లాబ్ స్టర్ రొయ్యలు.. మన దగ్గర అరుదుగా చిక్కుతుంటాయి. తాజాగా విలువైన ఈ రొయ్యలు చిక్కడంతో పూడిమడక మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
——ఖాజా, వైజాగ్
Also Read: Viral Photo: అందం అంటే ఏంటి అంటే ఈమెను చూపించవచ్చు.. సౌత్ ఇండియా సెన్సేషన్.. ఎవరో గుర్తించారా..?