Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజే 13 లక్షల టీకాలు..

Covid Vaccination: కోవిడ్ వైరస్‌ కట్టడి‌లో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డ్‌ నెలకొల్పింది. వ్యాక్సినేషన్ ప్రారంభించిన...

Covid Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డ్.. ఒక్క రోజే 13 లక్షల టీకాలు..
Vaccination
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 20, 2021 | 7:50 PM

Covid Vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ మరోసారి తన సత్తా చాటిచెప్పింది. అసాధారణ రీతిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది మొదలు.. ఇప్పటి వరకూ ఏ రాష్ట్రంలో చేయని విధంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ ఒక్క రోజులోనే 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేసింది. గతంలో ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్‌లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసింది. ఇవాళ ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 13 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.

ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఒక ఉద్యమంగా కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,232 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తొలుత ఆదివారం నాడు 8 నుంచి 9 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రజల నుంచి కూడా అనూహ్య రీతిలో స్పందన రావడంతో ప్రభుత్వం కూడా ఆ దిశగా వేగవంతమైన చర్యలు చేపట్టింది. మొత్తానికి ఇవాళ ఒక్క రోజే ఉదయం నుంచి సాయంత్రం వరకు 13 లక్షల మందికి టీకా వేసి.. జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. క్షేత్రస్థాయి వరకు వ్యాక్సిన్లు చేరుకున్నది మొదలు.. సరఫరా చేసేందుకు అన్నీ పకడబ్బందీగా చేపట్టారు. డోసులు రాష్ట్రానికి చేరుకోవడం.. ఆ వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయడం.. చకచకా చేసేశారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడంతో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి.

Vaccine

Vaccine

Vaccination Live:

Also read:

Infosis Employees: ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మరోమారు వేతనాలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటన