Infosis Employees: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మరోమారు వేతనాలు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటన
Infosis Employees: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం..
Infosis Employees: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పెంపు జూలై నెల నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇలా వేతనాలు పెంచడం ఇది రెండోసారి. వలసలను తగ్గించడానికి, నైపుణ్యం కలిగిన సిబ్బందిని తిరిగి రప్పించడానికి సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది తొలి నెల జనవరిలోనే సంస్థ జీతాలు పెంచిన విషయం తెలిసిందే.
అయితే శనివారం కంపెనీ 40వ వార్షికోత్సవ సాధారణ సమావేశంలో కంపెనీ సీవోవో ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. ఐటీ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే వలసలు అధికంగా ఉండటం కూడా మరో కారణమని పేర్కొన్నారు.
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 20 వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని, ఇప్పటికే విప్రో 80 శాతం మంది సిబ్బంది వేతనాలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు వచ్చే సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. అలాగే టీసీఎస్ కూడా ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చేలా వేతనాలు పెంచిన విషయం విధితమే.