Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP vs MLA: అధికార వైసీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సంచలనం రేకెత్తిస్తున్న కామెంట్స్..

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా అధికార వైసీపీలో ముఖ్య నేతల మధ్య అంతర్గత పోరు మళ్లీ రచ్చకెక్కింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి.

MP vs MLA: అధికార వైసీపీలో వర్గపోరు.. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. సంచలనం రేకెత్తిస్తున్న కామెంట్స్..
Ysr
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 21, 2021 | 8:23 AM

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా అధికార వైసీపీలో ముఖ్య నేతల మధ్య అంతర్గత పోరు మళ్లీ రచ్చకెక్కింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. జిల్లాలోని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య కొంత కాలంగా ఆధిప్యత పోరు కొనసాగుతోంది. దీంతో పార్టీ అధినాయకత్వం సీరియస్ అయ్యి ఇద్దరికి చెప్పటంతో కొంత కాలం కామ్ గా ఉన్నా ఇద్దరు నేతలు. అయితే, ఇప్పుడు తిరిగి తమ పాత పంథాలోనే ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో గెలిచిన ఈ ఇద్దరూ.. తొలిసారి చట్ట సభల్లోకి అడుగు పెట్టారు.

అయితే, ఎంపీగా గెలిచిన భరత్ వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. మాజీ మంత్రి, సీనియర్ నేత జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు. అయితే భరత్, రాజా ల మధ్య సఖ్యత 2019 ఎన్నికల తరువాత ఎంతో కాలం నిలవలేదు. ప్రధానంగా రాజమండ్రి అర్బన్.. రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన అంశాల్లోనే వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆవ భూములు, ఇసుక ర్యాంపుల విషయంలోనూ ఆరోపణలు వినిపించాయి. అక్కడ అధికారుల నియామకాల మొదలు.. నిర్ణయాల వరకు ఈ ఇద్దరిలో ఎవరి మాట వినాలో అర్థంకాక అధికారులు సైతం నలిగిపోతున్నారట. రాజమండ్రి అర్బన్, రూరల్‌లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వీరి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది.

అయితే వచ్చే ఎన్నికల కోసం ఈ రెండు నియోజకవర్గాల్లో పట్టు సాధించడం కోసం ఎంపీ భరత్ ప్రయత్నిస్తున్నారని టాక్. ఈ నేపథ్యంలోనే.. ఎంపీ భరత్ పార్టీలో వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వీరిద్దరి మధ్య వివాదాలు ముదురుతుండటంతో.. పార్టీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కలుగజేసుకున్నారు. వీరిద్దరితో అప్పట్లోనే సమావేశమయ్యారు. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. సీఎం సీరియస్ గా ఉన్నారని.. ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ఆ వార్నింగ్‌తో ఇద్దరు నేతలూ కాస్త వెనక్కి తగ్గారు. కొంతకాలం పాటు ఇద్దరు నేతలూ బాగానే కనిపించారు. కానీ, ఈ రెండు నియోజవర్గాల్లో జరుగుతున్న పరిణామాల్లో ఎవరికి వారు తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు మరలా పావులు కదుపుతున్నారు. జక్కంపూడి రాజా కొద్ది రోజుల క్రితం వరకు కాపు కార్పోరేషన్ చైర్మన్ గా పని చేశారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్, అర్బన్ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మార్పులోనూ ఎంపీ భరత్ పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే రాజా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఇదిలాఉంటే.. కొన్ని రోజుల క్రితం కోరుకొండలోని ప్రొఫెసర్ పై దాడి ఘటన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ భరత్ ల మధ్య చిచ్చు లేపింది. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ భరత్.. ఈ దాడి ఘటన విషయంలో ఎమ్మెల్యే రాజాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అది తెలుసుకున్న ఎమ్మెల్యే రాజా.. ఎంపీ భరత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలన కామెంట్స్ చేశారు. ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలో పార్టీని సర్వ నాశనం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. సీబీఐ మాజీ జేడీతో భరత్ కు పనేంటని ప్రశ్నించారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతారా? అంటూ నిలదీశారు. జగన్‌ను ఇబ్బంది పెట్టిన వారితో భరత్ కు ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పిచ్చి చేష్టలతో పార్టీకి నష్టం చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు. రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరితో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు షాడో గా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

కాగా, మరికొద్ది రోజుల్లో రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికలు జరగనునున్నాయి. ఈ సమయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఫలితాల పైన ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఇలా ఓపెన్ గా విమర్శలు చేసుకోవటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. మరి ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. అంతేకాదు.. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నారు. మరి ఆయన ఏ విధమైన కామెంట్స్ చేస్తారో వేచి చూడాలి.

Also read:Petrol Attack

: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోడు రైతుల ఆగ్రహం.. వీడియో

Viral Video: స్నేహమంటే ఇదేరా.. నెట్‌లో వైరల్‌గా మారిన కుక్క, పావురం స్నేహం.. నిద్రపోతున్న కుక్కను లేపుతూ పావురం అల్లరి..

సముద్రంలో సరదాగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలాగా.. వీడియో