Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మాఘ మాసంలో మల్లెల ధరలకు రెక్కలు.. మార్కెట్లో కిలో ధరెంతో తెలుసా?

మాఘ మాసంలో శుభకార్యాలు ముమ్మరంగా సాగుతుంటాయి. దీంతో మల్లెలకు మాంచి గిరాకీ ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లలో మల్లెల గుబాళింపు మొదలైంది. అయితే ఈ సారి సీజన్‌లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవటంతో వారం రోజులుగా ధరలు అమాంతం పెరిగాయి. దక్షిణాదిలో పలు ప్రాంతాలు మల్లె సాగుకు ప్రసిద్ధి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా మల్లెలకు ప్రసిద్ధి గాంచిన మైలవరం మండలంలోని..

Andhra Pradesh: మాఘ మాసంలో మల్లెల ధరలకు రెక్కలు.. మార్కెట్లో కిలో ధరెంతో తెలుసా?
jasmine flowers price in AP
Follow us
M Sivakumar

| Edited By: Srikar T

Updated on: Feb 19, 2024 | 5:44 PM

మైలవరం, ఫిబ్రవరి: మాఘ మాసంలో శుభకార్యాలు ముమ్మరంగా సాగుతుంటాయి. దీంతో మల్లెలకు మాంచి గిరాకీ ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లలో మల్లెల గుబాళింపు మొదలైంది. అయితే ఈ సారి సీజన్‌లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవటంతో వారం రోజులుగా ధరలు అమాంతం పెరిగాయి. దక్షిణాదిలో పలు ప్రాంతాలు మల్లె సాగుకు ప్రసిద్ధి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా మల్లెలకు ప్రసిద్ధి గాంచిన మైలవరం మండలంలోని చండ్రగూడెం మార్కెటులో ఆదివారం మల్లెలు రికార్డు ధర పలికింది. కిలో ఏకంగా రూ.1200 పలికింది. పంట ఉత్పత్తి తక్కువగా ఉండటంతో రోజుకు సగటున 50 కిలోలకు మించి దిగుబడులు రావడం లేదని రైతులు చెబుతున్నారు.

దీంతో సాధారణ దిగుబడులు సమయంలో కిలో రూ.200ల లోపే ధర ఉంటుండగా, ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి పెరగడం లేదని రైతులు చెబుతున్నాయి. తాజాగా సంభవించిన మిచాంగ్‌ తుపాను ప్రభావంతో దిగుబడుల్లో ఆలస్యం నెలకొన్నట్లు, ఇదే రైతులకు ఇబ్బందిగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరాదిని కమ్మిన మంచు దుప్పటి.. సందడి చేస్తున్న పర్యాటకులు

ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణం మంచుతో నిండిపోయాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. సన్నని శ్వేత తుంపరలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలన్నీ కనుచూపు దట్టమైన మంచు వర్షం కురుస్తోంది. రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు తుంపర దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యాటకులు మంచు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మంచులో తడుస్తూ సందడి చేస్తున్నారు. మరోవైపు రహదారులు మంచుతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నా వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్‌లో గల సావ్జియాన్‌ సెక్టార్‌లో కూడా భారీగా హిమపాతం కురుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.