AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ATM Robbery: బయ్యారంలో దొంగల భీభత్సం.. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం కట్‌ చేసి రూ.29 లక్షలు చోరీ

మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. షాపింగ్‌ మాల్స్‌, బ్యాంకులు, ఏటీఎంలు వేటినీ వదలడం లేదు. తాజాగా మహబూబాబాద్‌లని బయ్యారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన ఓ ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంపై దొంగలు కన్నేశారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు..

SBI ATM Robbery: బయ్యారంలో దొంగల భీభత్సం.. గ్యాస్‌ కట్టర్‌తో ఏటీఎం కట్‌ చేసి రూ.29 లక్షలు చోరీ
SBI ATM Robbery
Srilakshmi C
|

Updated on: Feb 18, 2024 | 3:05 PM

Share

మహబూబాబాద్, ఫిబ్రవరి 18: మహబూబాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. షాపింగ్‌ మాల్స్‌, బ్యాంకులు, ఏటీఎంలు వేటినీ వదలడం లేదు. తాజాగా మహబూబాబాద్‌లని బయ్యారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన ఓ ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంపై దొంగలు కన్నేశారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి రూ.29 లక్షల నగదును అపహరించినట్లు తెలుస్తున్నది.

ఆదివారం ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వినియోగదారులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవికుమార్, ఎస్ఐ ఉపేందర్ ఏటీఎంను పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఆర్ధరాత్రి సమయంలో బ్లాక్ కారులో వచ్చిన ఆరుగురు దుండగులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహబూబాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆనవాళ్లను సేకరించారు. నిందితుల వేలిముద్రలను సేకరించారు. కాగా ఆరు నెలల క్రితం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో మరో దొంగల ముఠా చోరీకి యత్నించగా.. వారిని 24 గంటలు వ్యవధిలోపే పోలీసులు గుర్తించారు. ఈ కేసును కూడా పోలీసులు త్వరలోనే చేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా జహీరాబాద్‌లో పట్టణంలోని మార్కెట్‌ ఏరియాలో ఉన్న ఐదు బట్టల దుకాణాల్లోనూ దుండగులు చోరీకి పాల్పడ్డారు. దీంతోపాటు మరో 4 మద్యం షాపుల్లోనూ దొంగతనం చేశారు. షాప్‌ షెట్టర్లను పగలగొట్టి షాపుల్లో ఉన్న నగదు, విలువైన సామగ్రి ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.