AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Former YouTube CEO: హాస్టల్‌ గదిలో శవమై కనిపించిన యూట్యూబ్‌ మాజీ సీఈవో కొడుకు.. ‘డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లేనా..?’

యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్‌కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యుసి)లోని తన హాస్టల్‌లో శవమై కనిపించాడు. క్లార్క్ కెర్ క్యాంపస్‌లో మార్కో ట్రోపర్ స్టూడెంట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో ఉంటున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 13 (మంగళవారం) సాయంత్రం 4:23 గంటల ప్రాంతంలో మార్కో ట్రోపర్ తన గదిలో విగతజీవిగా కనిపించినట్లు UC బర్కిలీ ప్రతినిధి జానెట్ గిల్మోర్ మీడియాకు తెలిపాడు. సమాచారం అందుకున్న..

Former YouTube CEO: హాస్టల్‌ గదిలో శవమై కనిపించిన యూట్యూబ్‌ మాజీ సీఈవో కొడుకు.. 'డ్రగ్స్ ఓవర్ డోస్ వల్లేనా..?'
Former YouTube CEO Susan Wojcicki Son Died
Srilakshmi C
|

Updated on: Feb 18, 2024 | 4:34 PM

Share

యూట్యూబ్ మాజీ సీఈఓ సుసాన్ వోజ్‌కికీ కుమారుడు మార్కో ట్రోపర్ (19) బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యుసి)లోని తన హాస్టల్‌లో శవమై కనిపించాడు. క్లార్క్ కెర్ క్యాంపస్‌లో మార్కో ట్రోపర్ స్టూడెంట్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో ఉంటున్నాడు. స్థానిక కాలమానం ప్రకారం ఫిబ్రవరి 13 (మంగళవారం) సాయంత్రం 4:23 గంటల ప్రాంతంలో మార్కో ట్రోపర్ తన గదిలో విగతజీవిగా కనిపించినట్లు UC బర్కిలీ ప్రతినిధి జానెట్ గిల్మోర్ మీడియాకు తెలిపాడు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ బృందం ట్రోపర్ ఉంటున్న గదిలో నుంచి ఎలాంటి శబ్దాలు రాకపోవడం వల్ల అనుమానంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే మార్కో ట్రోపర్ విగతజీవిగా మారాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. ట్రోపర్ గదిలో అనుమానాస్పద రీతిలో ఏ క్లూ కనిపించలేదని తెలిపారు. అతని మృతిపై కేసునమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు సాగిస్తున్నారు.

మృతుడి నానమ్మ ఎస్తేర్ వోజ్కికీ ఫిబ్రవరి 14 (బుధవారం) తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ట్రోపర్‌ మరణాన్ని ధృవీకరించారు. మార్కో ట్రోపర్ మరణాన్ని నిర్ధారించే సమయంలో ఎస్తేర్ వోజ్కికీ మీడియాతో మాట్లాడుతూ.. ట్రోవర్‌ డ్రగ్ ఓవర్ డోస్ వల్ల మరణించి ఉంటాడని అభిప్రాయపడ్డారు. అతను ఏ విధమైన డ్రగ్స్‌ తీసుకుంటున్నాడనే విషయం మాకు తెలియదు. మరేకుటుంబానికి ఇలా జరగకూడదన్నారు. పోస్టుమార్టం అనంతరం టాక్సికాలజీ రిపోర్టు వస్తేగానీ అసలు నిజం బయటపడదని పేర్కొన్నారు. ‘ట్రోపర్‌ కుటుంబం టాక్సికాలజీ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు. ‘నా ప్రియమైన మనవడు మార్కో ట్రోపర్ 19 ఏళ్ల వయస్సులోనే నిన్న మరణించాడు. మా కుటుంబం అర్థం చేసుకోలేని విధంగా నాశనం చేయబడిందంటూ’ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఎస్తేర్ వోజ్కికీ పేర్కొన్నారు.

మార్కో ట్రోపర్ UC బర్కిలీలో రెండో సెమిస్టర్ చదువుతున్నట్లు తెలిపారు. తన మనవడు చదువుతోన్న మ్యాథ్స్‌ కోర్స్‌ ఎంతో ఇష్టపడుతున్నట్లు తెలిపారు. విద్యాపరంగా తన మనవడు మంచి ట్యాలెంట్‌ ఉన్నవాడని, ట్రోపర్‌ హాస్టల్‌లో కూడా అతనికి మంచి స్నేహితులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంటికొచ్చినప్పుడు తన లైఫ్‌ గురించి, బెర్కెలేలోని తన ఫ్రెండ్స్‌ గురించి ఎన్నో విషయాలు చెప్పినట్లు మృతుడి నానమ్మ ఎస్తేర్ వోజ్కి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.