X Terrorists: ఉగ్రముఠాలకూ ‘ఎక్స్‌’ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌.! మస్క్‌కు సరికొత్త న్యాయ సమస్యలు.

X Terrorists: ఉగ్రముఠాలకూ ‘ఎక్స్‌’ బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్‌.! మస్క్‌కు సరికొత్త న్యాయ సమస్యలు.

Anil kumar poka

|

Updated on: Feb 18, 2024 | 1:36 PM

సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్‌ ప్రవేశపెట్టిన పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఉగ్రముఠాలకూ బ్లూ టిక్‌ ఇచ్చిన విషయాన్ని ది టెక్‌ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్‌ వెలుగులోకి తెచ్చింది. హెజ్‌బొల్లా వంటి నిషేధిత సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. ట్విటర్‌ను కొనుగోలు చేశాక బ్లూ టిక్‌ కోసం సొమ్ము వసూలు చేయాలన్నది ఎలాన్‌ మస్క్‌ తీసుకొన్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయం.

సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్‌ ప్రవేశపెట్టిన పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఉగ్రముఠాలకూ బ్లూ టిక్‌ ఇచ్చిన విషయాన్ని ది టెక్‌ ట్రాన్స్‌పరెన్సీ ప్రాజెక్ట్‌ వెలుగులోకి తెచ్చింది. హెజ్‌బొల్లా వంటి నిషేధిత సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. ట్విటర్‌ను కొనుగోలు చేశాక బ్లూ టిక్‌ కోసం సొమ్ము వసూలు చేయాలన్నది ఎలాన్‌ మస్క్‌ తీసుకొన్న అతిపెద్ద వివాదాస్పద నిర్ణయం. నెలకు 8 డాలర్లు చెల్లిస్తే బ్లూ టిక్‌ లభిస్తుంది. దీంతోపాటు సుదీర్ఘ పోస్టు పెట్టడానికి, మెరుగైన ప్రమోషన్‌కు ఇది ఉపయోగపడుతుంది. గతంలో బ్లూ టిక్‌ను ట్విటర్‌ ఉచితంగా కేటాయించేది. దీనిని పొందే వ్యక్తుల వివరాలను ఆ సంస్థ ధ్రువీకరించుకొనేది. బ్లూ టిక్‌ను పొందేవారిలో అత్యధికంగా జర్నలిస్టులు, ప్రపంచ నేతలు, వివిధ రంగాల్లో ప్రముఖులైనవారు ఉండేవారు. ఆ తర్వాత ఎక్స్‌ తీసుకొన్న నిర్ణయంతో సరికొత్త న్యాయ సమస్యలు ఎదురవ్వడం మొదలయ్యాయని టీటీపీ సంస్థ పేర్కొంది. ఈ నిర్ణయంతో తప్పుడు సమాచార వ్యాప్తి తీవ్రతరమవుతుందని చాలా సంస్థలు ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నివేదిక వెలువడిన తర్వాత కొన్ని సంస్థల బ్లూ టిక్స్‌ను ఎక్స్‌ తొలగించింది. తమ భద్రతా వ్యవస్థ బలంగా ఉందని పేర్కొంది. హౌతీల సంస్థ అన్సార్‌ అల్లా బ్లూ టిక్‌ అదృశ్యమైంది. ఈ సంస్థపై అమెరికా, యూకేలో ఆంక్షలున్నాయి. ఇంకా చాలా సంస్థలకు బ్లూ టిక్‌లు కొనసాగుతున్నాయని టీటీపీ పేర్కొంది. తన సామాజిక మాధ్యమ నిర్వహణపై ‘ఎక్స్‌’ నియంత్రణ కోల్పోయిందని టీటీపీ సంస్థ డైరెక్టర్‌ కేటీ పాల్‌ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 18, 2024 01:19 PM