Tirupati: సింహం పంజాకి బలైన ప్రహ్లద్.. అంతకుముందే వారిపై దాడి
ఫిబ్రవరి 15న గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రహ్లాద్ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు అధికారులు చెబుతున్నారు. లోపల ఉన్న సింహం ప్రహ్లాద్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందాడు. అయితే అతని దూకుడు ప్రవర్తనకు సంబంధించిన మరో వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.
తిరుపతిలో సింహం పంజాకి బలైన ప్రహ్లద్ గుర్జార్‌కి సంబంధించిన దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ఉన్న హథిరాంజీ మఠం సిబ్బందిపై అతను దాడి చేసినట్టు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు అధికారులు. దర్శనానికి వెళ్లాలంటే టికెట్ కొనుగోలు చేయాలని ప్రహ్లద్‌కు సూచించారు సిబ్బంది. ఆ క్రమంలోనే ఆగ్రహానికి గురైన ప్రహ్లద్.. అటెండర్ ముని సుబ్రహ్మణ్యంపై దాడికి దిగాడు. టికెట్లు ఇచ్చే రెండు మెషిన్లను విసిరేశాడు. ఈ దాడిలో సుబ్రహ్మణ్యంకు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అటెండర్‌పై దాడి చేస్తున్న క్రమంలో ప్రహ్లద్‌ను అడ్డుకునేందుకు అక్కడే ఉన్న భక్తులు వెనుకాడారు. ఆ తర్వాత కాస్త ధైర్యం చేసి అడ్డుకున్నారు. ఎడాపెడా వాయించి పోలీసులకు అప్పగించారు. ప్రహ్లద్ గంజాయి మత్తులో ఉన్నట్టు గుర్తించారు. ఈనెల 14న సాయంత్రం నాలుగున్నర గంటలకు దాడి జరిగింది. ఈనెల 15న ఎస్వీ జూ పార్క్‌కి వెళ్లిన ప్రహ్లద్ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సింహాం పంజాకి బలయ్యాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

