Tiger Plastic: పులి చెబుతున్న గుణపాఠం! మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా?
ఇందుగలదు అందు లేదు..అన్నట్టు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది. మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి. తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది. పులి చెబుతన్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అన్న నిర్వేదం వ్యక్తమవుతోంది.
ఇందుగలదు అందు లేదు..అన్నట్టు సర్వత్రా వ్యాపించిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ప్రస్తుతం సంక్షోభ స్థాయికి చేరుకుంది. మనుషుల తప్పిదానికి జంతువులు కూడా బలవుతున్నాయి. తెలియక ప్లాస్టిక్ వ్యర్థాలను తింటూ మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్‌గా మారిన ఓ వీడియో నెటిజన్లను అమితంగా కదిలిస్తోంది. పులి చెబుతన్న ఈ గుణపాఠాన్ని మనుషులు ఎప్పటికైనా నేర్చుకుంటారా? అన్న నిర్వేదం వ్యక్తమవుతోంది. అడవి లోని నీటి మడుగు నుంచి ప్లాస్టిక్ బాటిల్‌ను నోటితో పట్టుకుని పులి వస్తున్న దృశ్యం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ కథికార్ ఈ అరుదైన సంఘటనను తన కెమెరాలో బంధించ గలిగారు. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లోని రామ్‌డేగి కొండల్లో భానుష్కిండి అనే పులి కూన ఈ విధంగా ప్లాస్టిక్ సీసాను పట్టుకు వస్తోందని ఫోటో గ్రాఫర్ వివరించారు. ఈ ఫోటోను తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫిబ్రవరి 13 న షేర్ చేశారు. ‘పులి అందించిన మధుర సంకేతం’ అన్న శీర్షిక పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను దాదాపు 21 వేల మంది వీక్షించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి అడవులను పరిశుభ్రం చేసుకోవాలన్న సందేశం వినిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

