AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Roja – Andhra Pradesh: ఎమ్మెల్యే రోజా పొలిటీషియనే కాదు.. మంచి డాక్టర్ కూడా.. ఇదిగో ఇక్కడ చూడండి..!

MLA Roja - Andhra Pradesh: అటు కెరియర్ పరంగా, ఇటు రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ప్రజలకు మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటారు.

MLA Roja - Andhra Pradesh: ఎమ్మెల్యే రోజా పొలిటీషియనే కాదు.. మంచి డాక్టర్ కూడా.. ఇదిగో ఇక్కడ చూడండి..!
Mla Roja
Shiva Prajapati
|

Updated on: Dec 24, 2021 | 5:33 PM

Share

MLA Roja – Andhra Pradesh: అటు కెరియర్ పరంగా, ఇటు రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ప్రజలకు మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటారు. నియోజకవర్గం పరిధిలో జరిగే అన్ని కార్యక్రమాలకు ఆవిడ హాజరవుతారు. ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. సంబరాల్లో పాల్గొంటారు. ఎన్నో సందర్భంగా తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకున్న రోజా.. డప్పు వాయించడం, కబడ్డీ పోటీల్లో పాల్గొనడం కూడా చేశారు. అయితే, చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా వైద్యురాలి అవతారమెత్తారు. యాక్టర్ గానే కాదు డాక్టర్ గా కూడా రాణిస్తానంటూ పుత్తూరు మండలంలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరంలో నిరూపించారు.

శుక్రవారం నాడు గొల్లపల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన రోజా వైద్యురాలిగా మారి.. మెగా హెల్త్ క్యాంప్ లో మహిళలకు బీపీ, షుగర్ చెక్ చేశారు. మందులు పంపిణీ చేసిన రోజా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించడం కోసం మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సీఎం జగన్ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నారన్నారు రోజా. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకుందన్నారు.

Also read:

Hyderabad: వచ్చే వారం గ్రేటర్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు

Minister Anil Kumar Yadav: నాని, పవన్ కళ్యాణ్ పై మంత్రి అనిల్‌కుమార్‌ పవర్‌ఫుల్ పంచ్‌లు లైవ్ వీడియో

ఇలా అయితే మా వల్ల కాదు.. ఏకంగా థియేటర్ మూసివేసిన యజమాని.. అసలు విషయం ఏంటంటే..