Andhra Pradesh Politics: ఏపీ బీజేపీలో రెండు గ్రూప్‌లు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే..
Andhra Pradesh Politics: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు.

Andhra Pradesh Politics: బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రమేష్ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీస్ వ్యవస్థను ఎలా చూసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. ఏపీ పోలీసు వ్యవస్థ పని తీరును గుర్తించే కేంద్రం అవార్డులు ఇచ్చిందన్నారు. అవన్నీ మర్చిపోయి రమేష్ మాట్లాడుతున్నారని మల్లాది మండిపడ్డారు.
ఆయన చంద్రబాబు తరుపున మాట్లాడుతున్నారో, బీజేపీ తరుపున మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుండి ఏపీకి రావాల్సిన వాటి గురించి మాట్లాడాలి కాని, చంద్రబాబు కు కోవర్ట్ గా మాట్లాడడం సరి కాదన్నారు. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం ఇష్టం వచ్చినట్టు పనిచేయడం కుదరదన్నారు. రాష్ట్ర శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని అన్నారు. ఏపీలో డూప్లికేట్ బీజేపీ, ఒరిజినల్ బీజేపీ ఉన్నాయని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. సొంత విమానాల్లో తిరిగే సీఎం రమేష్ కి ప్రజా సమస్యల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. మద్యం పాలసీపై సీఎం రమేష్ తో చర్చకు తాను సిద్ధం అని మల్లాది విష్ణు ప్రకటించారు.
Also read:
Hyderabad: వచ్చే వారం గ్రేటర్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం.. పూర్తి వివరాలు
Minister Anil Kumar Yadav: నాని, పవన్ కళ్యాణ్ పై మంత్రి అనిల్‌కుమార్ పవర్‌ఫుల్ పంచ్‌లు లైవ్ వీడియో
ఇలా అయితే మా వల్ల కాదు.. ఏకంగా థియేటర్ మూసివేసిన యజమాని.. అసలు విషయం ఏంటంటే..
