AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా అయితే మా వల్ల కాదు.. ఏకంగా థియేటర్ మూసివేసిన యజమాని.. అసలు విషయం ఏంటంటే..

ఏపీ అంతటా అధికారులు సీజ్‌ చేసినవి 50కి పైగా ఉంటే మరో 50 స్వచ్చందంగానే మూసేశారు థియేటర్ల యజమానులు. కరోనా పేండమిక్‌ తర్వాత కొత్త సినిమాలతో కష్టాల..

ఇలా అయితే మా వల్ల కాదు.. ఏకంగా థియేటర్ మూసివేసిన యజమాని.. అసలు విషయం ఏంటంటే..
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2021 | 5:12 PM

Share

ఏపీ అంతటా అధికారులు సీజ్‌ చేసినవి 50కి పైగా ఉంటే మరో 50 స్వచ్చందంగానే మూసేశారు థియేటర్ల యజమానులు. కరోనా పేండమిక్‌ తర్వాత కొత్త సినిమాలతో కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆశగా చూసిన ఎగ్జిబిటర్స్‌ వ్యవస్థకు ఆశనిపాతంగా మారింది తాజా వివాదం. ఏపీలో టికెట్‌ వివాదం సినిమా హాలు యజమాని నుంచి హీరోదాకా అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ప్రకారం ధరలు మరీ తక్కువగా ఉన్నాయంటోంది ఇండస్ట్రీ. దీని వల్ల కరెంట్‌ ఖర్చులు రావన్నది వారి వాదన అయితే సామాన్యులను దృష్టిలో పెట్టుకుని మరీ జీవో తెచ్చామంటోంది సర్కార్‌. జీవో వ్యవహారం పంచాయితీ చేరినా ఇరువర్గాల వాదనలో వివాదం రోడ్డున పడింది.

కిరాణ కలెక్షన్ల కంటే దారుణమని నాని వ్యాఖ్యలు అగ్గిరాజేస్తే… హీరో సిద్దార్థ్‌ సంచలన ట్వీట్‌తో ఆజ్యం పోశారు. పన్నులు కట్టే మా డబ్బుతో లగ్జరీలు, వేలు, లక్షల కోట్లు అవినీతి చేస్తున్న మంత్రులు తమ విలాసాలు తగ్గించుకుని మాకు డిస్కౌంట్‌ ఇవ్వాలంటూ సెటైర్‌ వేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు బొత్స, కొడాలి నాని, కన్నబాబు లేటెస్టుగా అనిల్‌ యాదవ్‌ ఎటాక్‌ చేస్తున్నారు. హీరోలు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలని వకీల్‌సాబ్‌, బీమ్లా నాయక్‌ సినిమాల ఖర్చెంత. పవన్‌ కల్యాణకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ ఎంతంటూ ప్రశ్నించారు మంత్రి అనిల్‌. మంత్రి అనిల్‌ వ్యాఖ్యలతో వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ఒక్కరిని టార్గెట్‌ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బందులుల పెడుతున్నారంటున్నాయి విపక్షాలు.

జీవో తర్వాత చర్చలతో సినిమాకు క్లైమాక్స్‌ పడుతుందని ఆశించారు. మంత్రి పేర్ని నానికి సినిమాటొగ్రఫి శాఖ అప్పగించింది ప్రభుత్వం. కానీ రచ్చ రోజురోజుకు రావణ కాష్టంలా ఎగసిపడుతూనే ఉంది. మరి సర్కార్‌ వర్సెస్‌ సినిమా ఇండస్ట్రీకి ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు పడుతుందో. ఇదిలా ఉంటే ధరలు తాగించడంతో  విశాఖపట్నం ఓ థియేటర్ స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్.రాయవరం మండలం,పి.ధర్మవరం గ్రామంలో ఉన్న శ్రీబాలత్రిపుర సుందరి కళా మందిర్ థియేటర్ ని  యాజమాన్యం మూసివేసింది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు థియేటర్ నడపడం మా వల్లకాదు.. అందుచేత తాత్కాలికంగా మూసివేస్తున్నాం అంటూ బోర్డ్ పెట్టి థియేటర్ ను మూసివేసింది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

Pic

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ స్టోరీ అదేనంటా ?.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..