AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వచ్చే వారం గ్రేటర్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు

Hyderabad Water Supply: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.

Hyderabad: వచ్చే వారం గ్రేటర్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం.. పూర్తి వివరాలు
Hyderabad Water Supply
Janardhan Veluru
|

Updated on: Dec 24, 2021 | 5:24 PM

Share

Hyderabad Water Supply: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. TSIICL అభివృద్ధి చేస్తున్న రహదారి విస్తరణ భాగంగా ఓఆర్ఆర్ పటాన్‌చెరు నుండి ఓఆర్ఆర్ గచ్చిబౌలి వరకు ఆరు లేన్ల రహదారిని విస్తరించడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖానాపూర్ రిజర్వాయర్ నుండి షేక్‌పేట్ జలాశయానికి వెళ్లే 1200mm డయా PSC పైప్‌లైన్ జంక్ష‌న్ ప‌నులు జ‌ల‌మండ‌లి చేప‌ట్టనుంది. ఈ నెల 28వ తేదీ (మంగళవారం) ఉద‌యం 6 గంటల నుండి మరుసటి రోజు 29వ తేదీ (బుధవారం) ఉద‌యం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ పనుల కారణంగా  24 గంటల పాటు ఖానాపూర్ రిజ‌ర్వాయ‌ర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నెం. 18: మణికొండ మున్సిపాలిటీ, నార్సింగి మున్సిపాలిటీ ప్రాంతాలైన గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఖానాపూర్, నెక్నాంపూర్ మరియు మంచిరేవుల ప‌రిధిలోని ప్రాంతాలు.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి ఓ ప్రకటనలో కోరింది.

Also Read..

COVID-19 3rd Wave: ఇండియాలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం.. IIT కాన్పూర్ పరిశోధకుల అంచనా..!

Vadivelu Covid Positive: తమిళ నటుడు వడివేలుకు కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..