Hyderabad Road Accident: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్‌ దుర్మరణం

Hyderabad Road Accident: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. ఓ పచ్చిని కుటుంబాన్ని రోడ్డున పడేసింది. హైదరాబాద్‌లోని బేగంపేటలో శుక్రవారం ఉదయం

Hyderabad Road Accident: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్‌ దుర్మరణం
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 24, 2021 | 9:42 AM

Hyderabad Road Accident: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. ఓ పచ్చిని కుటుంబాన్ని రోడ్డున పడేసింది. హైదరాబాద్‌లోని బేగంపేటలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ప్రముఖ వార్త ఛానెల్‌లో పనిచేస్తున్న యువ జర్నలిస్ట్ దుర్మరణం చెందాడు. ఓ ప్రముఖ ఛానెల్‌ వెబ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ఓతూరి మధుసూదన్ శుక్రవారం ఉదయం డ్యూటీకి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర అతివేగంగా వచ్చిన ఓ ట్రక్ మధు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్ తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన ట్రక్కును గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ముధుసూదన్ మృతిపట్ల పలువురు జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు.

Also Read:

Crime News: నల్లగొండలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. ఆపై తండ్రి ఏం చేశాడంటే..?

US Shooting: షోరూమ్‌లో దుండగుడి వీరంగం.. పేలిన తుపాకులు.. చిన్నారి సహా ఇద్దరు మృతి