AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: నల్లగొండలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. ఆపై తండ్రి ఏం చేశాడంటే..?

Man commits suicide after killing 2 childrens: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏ కష్టమొచ్చిందో.. ఏమో తెలియదు కానీ.. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి.. తాను

Crime News: నల్లగొండలో దారుణం.. ఇద్దరు కొడుకులను చంపి.. ఆపై తండ్రి ఏం చేశాడంటే..?
Shaik Madar Saheb
|

Updated on: Dec 24, 2021 | 9:25 AM

Share

Man commits suicide after killing 2 childrens: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏ కష్టమొచ్చిందో.. ఏమో తెలియదు కానీ.. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని దామరచర్ల మండలం నునవత్ తండాలో జరిగింది. తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపి.. తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నునావత్ తండాకు చెందిన కిషన్ నాయక్ వ్యవసాయం పొలం వద్ద.. కిషన్, అతని కుమారులు హర్షవర్ధన్ (8) అఖిల్ (6) మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు. పురుగుల మందును మజా కూల్ డ్రింక్‌లో కలిపి తాపించి కుమారులను చంపి.. ఆపై కిషన్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలు కారణంగా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి పలు వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతోనే ఈఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా.. సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

83 Movie Review: 83 మ‌న చ‌రిత్ర‌… త‌ర‌త‌రాలు గ‌ర్వంగా చెప్పుకునే ఘ‌న‌చ‌రిత్ర‌!