US Shooting: షోరూమ్‌లో దుండగుడి వీరంగం.. పేలిన తుపాకులు.. చిన్నారి సహా ఇద్దరు మృతి

US Los Angeles Shooting: అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లో దారుణం జరిగింది. మారణాయుధాలతో ఓ షోరూమ్‌లోకి చొరబడిన దుండగుడు వీరంగం

US Shooting: షోరూమ్‌లో దుండగుడి వీరంగం.. పేలిన తుపాకులు.. చిన్నారి సహా ఇద్దరు మృతి
Us Shooting
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 24, 2021 | 8:57 AM

US Los Angeles Shooting: అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లో దారుణం జరిగింది. మారణాయుధాలతో ఓ షోరూమ్‌లోకి చొరబడిన దుండగుడు వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై దాడి చేశాడు. సమాచారమందుకున్న పోలీసులు..అక్కడికి చేరుకొని ఆ దుండగుడిని పట్టుకునేందుకు కాల్పులు జరిపారు. అయితే ఆ కాల్పుల్లో 14ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఆ తర్వాత ఆ దుండగుడిని కూడా మట్టుబెట్టారు పోలీసులు. దుండగుడి దాడిలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలోని నార్త్ హాలీవుడ్ బర్లింగ్‌టన్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. తాజాగా ఆ దేశంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. అంతకుముందు కూడా జరిగిన కాల్పుల ఘటనల్లో అనేక మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం పోలీసులు.. అప్రమత్తమయ్యారు. షోరూమ్ ప్రదేశాన్ని చుట్టుముట్టి వివరాలు సేకరిస్తున్నారు.

Also Read:

5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు కరోనా వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ..! అధ్యయనంలో షాకింగ్‌ నిజాలు..

Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్‌ సీఈవోగా ఆమ్రపాలి..

Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా.. సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..