Omicron: ఒమిక్రాన్‌కు ఒకే ఒక్క టాబ్లెట్‌తో చెక్.. ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నారంటున్న..

Omicron: ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది.. మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ షరవేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కరోనా కట్టడి కోసం తాము తయారు..

Omicron: ఒమిక్రాన్‌కు ఒకే ఒక్క టాబ్లెట్‌తో చెక్.. ఆసుపత్రికి వెళ్లకుండానే కోలుకున్నారంటున్న..
Pfizer Anti Covid Pill
Follow us
Surya Kala

|

Updated on: Dec 23, 2021 | 11:57 AM

Omicron: ఓ వైపు కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతోంది.. మరోవైపు కరోనా వైరస్ కొత్త వేరియంట్ షరవేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కరోనా కట్టడి కోసం తాము తయారు చేసిన యాంటీ వైరల్ డ్రగ్ కూడా పనిచేస్తుందని అమెరికన్ కు చెందిన ఫైజర్ కంపనీ ప్రకటించింది.  తాము ఈ మేరకు ఇప్పటికే సుమారు 2,250 మందిపై ఫైజర్ టాబ్లెట్స్ ను ప్రయోగించినట్లు.. అవి సత్ఫలితాలను ఇచ్చినట్లు .. హై రిస్క్ ఉన్న  వారిలో కూడా ఆస్పత్రిలో చేరే ప్రమాదం నుంచి తగ్గించినట్లు వెల్లడించింది. తాము తమ ట్యాబ్లెట్లతో టీకాలు వేసు కోని పెద్ద వయసు ఉన్నవారిపైనా, అస్తమా, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు ఉవారివైపునా ట్రయల్స్  వేసినట్లు ప్రకటించింది.

ఒమిక్రాన్ లక్షణాలు కనిపించిన వెంటనే ఫైజర్ మందులను ఉపయోగించినవారు త్వరగా కోలుకున్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొంది. అంతేకాదు ల్యాబ్​లో కూడా నిర్వహించిన పరీక్షల్లో కూడా ఫైజర్ పనిచేతున్నట్లు వెల్లడైందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ రిప్రొడక్షన్ కోసం ఉపయోగించే కీలకమైన ప్రొటీన్ ను సింథటిక్ గా తయారు చేసి టెస్టు చేసినట్లు.. అది ఒమిక్రాన్ ను సమర్ధవంతంగా అడ్డుకున్నట్లు ఫైజర్ సంస్థ ప్రకటించింది.

అయితే ఫైజర్ తో పాటు మేరక మెర్క్ కంపెనీ కూడా ఒమిక్రాన్ కి ఔషధంగా టాబ్లెట్స్ ను తయారు చేసింది.  తమ మెడిసిన్ హైరిస్క్ పేషెంట్లలో 30 శాతం ముప్పు తగ్గిస్తుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ) అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్​ బాధితుల సంఖ్య పెరగొచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు చిక్తిస కోసం ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య భారీగా ఉండవచ్చునని… మరణాలు కూడా పెరగవచ్చు అని అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ ఇప్పటిదాకా 63 దేశాలకు వ్యాపించినట్లు ప్రకటించింది.

Also Read:  2 నెలల కష్టం.. 50 వేల ఖర్చు. 70ఏళ్ల మఱ్ఱి చెట్టుకు పునర్జన్మనిచ్చిన ప్రకృతి ప్రేమికుడు .. ఎక్కడంటే..