AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banyan Tree: 2 నెలల కష్టం.. 50 వేల ఖర్చు. 70ఏళ్ల మఱ్ఱి చెట్టుకు పునర్జన్మనిచ్చిన ప్రకృతి ప్రేమికుడు .. ఎక్కడంటే..

Tree Lover-Banyan Tree: మోడు వారిన మర్రి చెట్టును చిగురింప జేశాడు..  చెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో మరోచోటకు తలించి శాశ్వతంగా బతికించాలన్నది ఆశయంతో రూ.50 వేలకు...

Banyan Tree: 2 నెలల కష్టం.. 50 వేల ఖర్చు. 70ఏళ్ల మఱ్ఱి చెట్టుకు పునర్జన్మనిచ్చిన ప్రకృతి ప్రేమికుడు .. ఎక్కడంటే..
Banyan Tree
Surya Kala
|

Updated on: Dec 23, 2021 | 11:27 AM

Share

Tree Lover-Banyan Tree: మోడు వారిన మర్రి చెట్టును చిగురింప జేశాడు..  చెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో మరోచోటకు తలించి శాశ్వతంగా బతికించాలన్నది ఆశయంతో రూ.50 వేలకు పైగా ఖర్చు పెట్టి..  ప్రాణవాయువు ను ఇచ్చే మహా వృక్షానికే ఆయువు పోశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే…..

మూడు నెలల క్రితం గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు జిల్లాలోని కోనారావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ ల వ్యవసాయ క్షేత్రంలో ఉన్న  70 ఎండ్ల మఱ్ఱి చెట్టు కూకటి వేళ్ళతో పెకిలి పోయింది.  నీరు అందక కొద్ది రోజులకు మఱ్ఱి చెట్టు మోడు గా మారింది. చూపరులకు నిర్జీవంగా దర్శనం ఇస్తుంది. అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు, వృక్షో రక్షతి రక్షితః అనే మాటలను త్రికరణ శుద్ధి గా నమ్మే వ్యక్తి డాక్టర్ దొబ్బల ప్రకాష్ ఈ దృశ్యాన్ని చూసాడు. మొన్నటి వరకూ… మహా వృక్షంగా టివిగా నిలబడి ఎంతో మందికి నీడ నిచ్చి … ప్రాణులు, పక్షులకు గూడు గా నిలిచిన చెట్టే ప్రకృతి వైపరీత్యానికి నిస్సహాయంగా, నిర్జీవంగా ఉండడం చూసి కలత చెందాడు.

ఆయువు తీరిందని ప్రజలు భావిస్తున్న మఱ్ఱి చెట్టుకు నీటిని అందిస్తే మఱ్ఱి వృక్షానికి ఆయువు తిరిగి పోయవచ్చు అని భావించాడు. అనుకున్నదే తడవుగా… రైతు బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ ల తో మాట్లాడాడు. మోడు వారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి ఇక్కడ నుంచే మరో చోటికి తరలిస్తాననీ తెలిపాడు. పక్కనే గల రైతు దొబ్బల దాస్ వ్యవసాయ క్షేత్రం లోని బావి నీటిని వాడుకునేందుకు నీటినీ వాడుకునేందుకు అనుమతి తీసుకున్నాడు.

తాను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చెట్టు కు నీటిని అందించాడు. ప్రకాష్ కృషి ఫలించింది. క్రమంగా చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ఆ విషయాన్ని గమనించిన ప్రకాష్ ద్విగుణీకృత ఉత్సాహంతో రెండు నెలల పాటు నీటిని పట్టాడు. ఇంకా కొనసాగిస్తున్నాడు. ఫలితంగా మోడు వారిన చెట్టు చిగురించిన ఆకులతో పచ్చగా దర్శనం ఇస్తుంది. చెట్టు వేళ్ళు బయటకి రావడంతో… వెళ్లకు ఉన్న మట్టిని తడపడం ద్వారా చెట్టుకు ప్రకాష్ ప్రాణం పోశారు. అయితే వేళ్ళు బయట ఉండడంతో నీరు పడుతుంటే మట్టి కొద్ది కొద్దిగా ఊడి పోతుంది. చాలా కాలం ఇలాగే ఉంటే మట్టి పూర్తిగా తొలగి పోయి చెట్టు చనిపోయే ప్రమాదం ఉందని … అలా అయితే 70 ఎండ్ల చెట్టు ఆయువు శాశ్వతంగా పోతుందని ప్రకాష్ ఆందోళన చెందుతున్నాడు. అలా జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా మఱ్ఱి చెట్టు ను ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో ఒకచోట నుంచి మరోచోటకు తరలించి నాటడమే పరిష్కార మార్గo అని చెబుతున్నాడు

మర్రి చెట్టు ను తమ గ్రామంలోని స్కూల్ కు తరలించి విద్యార్థులకు నీడ నిచ్చేలా ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలన్నది ప్రకాష్ ఆలోచన. ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలంటే చెట్టును ట్రిమ్ చేయడం, లిఫ్ట్ చేయడం, వాహనంలో తరలించడం, తిరిగి నాటడం చేయాలి. అందుకు రూ. 50 వేల ఖర్చు అవుతుంది. మర్రి చెట్టు కు ప్రాణ మైతే పోయగలిగాడు గానీ.. అంత ఖర్చు ను వెచ్చించే డబ్బు తన వద్ద లేదు. దాతలు ఎవరైనా ముందుకు వస్తే… 70 ఎండ్ల వయస్సు ఉన్న మఱ్ఱి చెట్టు ను ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో ఒకచోట నుంచి మరోచోటకు తరలిస్తాననీ ప్రకాష్ తెలిపారు.

గతంలోనూ… పచ్చదనం పెంచేందుకు ప్రకాష్ కృషి చేశాడు. పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తి తో దొబ్బల ప్రకాష్ రాజన్న సిరిసిల్ల జిల్లా లో పచ్చదనం పెంచేందుకు తనవంతు సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నాడు.

Sampath, Karimnagar dist, TV9

Also Read: ఈ నాలుగు రాశులవారు మంచి ఆహార ప్రియులు.. అందులో మీరున్నారా లేదో తెలుసుకోండి..(PHOTO GALLERY)