Covid lockdown: ఆ గ్రామస్థుల సెల్ఫ్ లాక్ డౌన్.. సిరిసిల్ల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు గ్రామస్తులు. ఇటీవల దుబాయ్ నుండి తన గ్రామం గూడెం వచ్చిన వ్యక్తికి..
Self Covid lockdown: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు గ్రామస్తులు. ఇటీవల దుబాయ్ నుండి తన గ్రామం గూడెం వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ నిర్దారించారు. తాజాగా అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారించారు. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించుకున్నారు గ్రామస్తులు. గ్రామంలో గల ప్రజలు బయటకు వెళ్లవద్దని, బయటివారు గూడెం కు రావద్దని నిర్ణయించారు. బాధితుడు ఎల్లారెడ్డి పేట మండలం నారాయణపురం లో ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. దీంతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలు సేకరించి, వారిని ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ఆదేశించారు వైద్యాధికారులు.
ఇదిలావుంటే.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఒమైక్రాన్ వైరస్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలకు ఆంక్షలు విధించాలని న్యాయస్థానం ఆదేశించింది. జనం గుంపులు గుంపులుగా గుమి గూడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..